ETV Bharat / state

సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణ కన్నా ఏపీ సహకారమే ఎక్కువ: జగన్

author img

By

Published : Feb 10, 2022, 6:17 PM IST

AP CM Jagan
AP CM Jagan

AP CM Jagan On Movie Tickets : సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే అందరి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

AP CM Jagan On Movie Tickets : సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే.. అందరి అభ్యర్థనలనూ పరిగణలోకి తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ తరచూ సమావేశమై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తనతో పంచుకున్నట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం జగన్‌ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు.. ప్రభుత్వ ఆలోచనలను సీఎం వారికి వివరించారు.

భారీ బడ్జెట్‌ సినిమాలకు వారంపాటు ప్రత్యేక ధరలు..

‘‘సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడేందుకు ఓ మంచి వ్యవస్థను క్రియేట్‌ చేసే ఉద్దేశంతో అడుగులు వేశాం. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతాయి. నేను, చిరంజీవి కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్‌, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని అనుకున్నాం." - జగన్​, ఏపీ ముఖ్యమంత్రి

సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖపట్నం రావాలని, అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ హామీఇచ్చారు. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే.. వాళ్లకూ విశాఖలో స్థలాలు ఇస్తామని అన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో విశాఖపట్నం పోటీపడగలదని, ఇంకో పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలని సూచించారు. తెలంగాణ కన్నా.. ఏపీ నుంచే సినీ పరిశ్రమకు ఆదాయం ఎక్కువ వస్తోందన్నారు. ఏపీలో జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువన్న ముఖ్యమంత్రి.. 20 శాతం షూటింగ్‌లు రాష్ట్రంలో చిత్రీకరిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు.

AP CM Jagan On Movie Tickets : సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ : జగన్

ఇదీ చూడండి : Perni Nani Comments: 'సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి.. ఓ కోరిక కోరారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.