ETV Bharat / state

KCR DELHI TOUR: ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన

author img

By

Published : Sep 9, 2021, 1:50 PM IST

సీఎం కేసీఆర్​(CM KCR) దిల్లీ పర్యటన(DELHI TOUR) పూర్తయింది. ఈ నెల 1న దిల్లీకి బయలుదేరిన ఆయన.. హస్తినలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భూమి పూజ తర్వాత ప్రధాని, హోం, రోడ్డు రవాణా, జలశక్తి శాఖల మంత్రులను కేసీఆర్​ కలిశారు. 9 రోజుల పర్యటన అనంతరం ఈ రోజు హైదరాబాద్​కు బయలుదేరారు.

Chief Minister KCR visit to Delhi ended
కేసీఆర్ దిల్లీ పర్యటన పూర్తి

సీఎం కేసీఆర్(CM KCR)​ విజయవంతంగా దిల్లీ పర్యటన(DECHI TOUR) పూర్తి చేసుకున్నారు. 9రోజుల పాటు అక్కడ బస చేసిన ఆయన.. ఈరోజు హైదరాబాద్​కు తిరుగు పయనమయ్యారు. ఈ నెల 1న కేసీఆర్​ దిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం దిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2వ తేదీన దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రధానితో భేటీ

భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీ(PM NARENDRA MODI)తో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.

అమిషాతో కేసీఆర్​ చర్చలు

4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్​షా(CENTRAL HOME MINISTER AMIT SHAH)తో భేటీ అయిన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌ షాతో 45 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలో, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్​ అధికారులను కేటాయించాలని విన్నవించారు.

విడివిడిగా సమావేశం

ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్(SHAKAVATH)​, రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ(NITHIN GADKARI)లతో కేసీఆర్​ విడివిడిగా సమావేశమయ్యారు. జాతీయ రహదారుల విస్తరణపై కేసీఆర్​.. గడ్కరీతో చర్చించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ​.. కాళేశ్వరానికి జాతీయ హోదా, ఇతర అంశాలపై షెకావత్​కు పలు విజ్ఞప్తులు చేశారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: సీబీఐని కలిసిన రేవంత్​.. కోకాపేట్, ఖానామెట్‌ భూముల అమ్మకాలపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.