ETV Bharat / state

ఘనంగా ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జయంతి

author img

By

Published : Jun 6, 2021, 4:18 PM IST

ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు(chandra rajeswara rao) 107వ జయంతి వేడుకలను హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిపారు. తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల కార్యదర్శులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. పేదలు, అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడు చండ్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

chandra rajeswara rao: తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత జయంతి వేడుకలు
chandra rajeswara rao: తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత జయంతి వేడుకలు

హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు(chandra rajeswara rao) 107వ జయంతిని నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చండ్ర చిత్ర పటానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి(chada venkat reddy), ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ap secretary ramakrishna) పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చండ్ర రాజేశ్వరరావు తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అకింతం చేశారని చాడ పేర్కొన్నారు. భూమి కోసం భూక్తి కోసం చేసిన అన్ని పోరాటాల్లో అగ్ర నాయకత్వంగా ఉంటూ... తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి చండ్ర అని రామకృష్ణ తెలిపారు. సుదీర్ఘ కాలంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక మంది మన్నన్నలు పొందారని... ఆయనను ఆదర్శంగా తీసుకుని వామపక్ష పార్టీలు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని చాడ వెంకట్​రెడ్డి కోరారు.

ఇదీ చూడండి: Maoist : గుండెపోటుతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.