ETV Bharat / state

BRS Parliamentary Party Meeting : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 6:39 AM IST

Updated : Sep 12, 2023, 11:33 AM IST

BRS Parliamentary Party Meeting on 15
BRS Parliamentary Party Meeting

BRS Parliamentary Party Meeting : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ జరగనుండగా.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని సీఎం కోరారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

BRS Parliamentary Party Meeting : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ.. ఈ నెల 15న సమావేశం కానుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశానికి (BRS Parliamentary Party Meeting)తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ కోరారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Parliament Special Session 2023 : సెప్టెంబర్​లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎజెండాపై కేంద్రం సస్పెన్స్​!

జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చకు రావచ్చునని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇతర అంశాలపై చర్చకు కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్‌లపై చర్చ జరపాలని ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీలకు లేఖ రాశారు. వీటన్నింటిపై బీఆర్‌ఎస్‌ వైఖరిని కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Parliament Special Session 2023 : ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇటీవలే ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్‌ చేసిన ఆయన.. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఫల ప్రదమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత లేనప్పటికీ.. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారేందుకే ఈ భేటీ అని కొందరు అంటుండగా.. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకే అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Harishrao on Jamili Elections : 'జమిలి వచ్చినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్​ఎస్​దే'

'జమిలి' కోసమే సమావేశాలు..: వీటితో పాటు ఇటీవల ముగిసిన జీ-20 సదస్సులో కీలక చర్చలు, జమ్ముకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ఇటీవలే కేంద్రం ఓ ప్రత్యేక కమిటీని నియమించడంతో.. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

One Nation One Election : జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ.. ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న

బీఆర్‌ఎస్‌ దేనికైనా సిద్ధం..: ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. జమిలి ఎన్నికల(One Nation One Election) చర్చ తెరపైకి రావటంతో ఆ దిశగానూ సిద్ధమవుతోంది. కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ ముఖ్యనాయకులతో వరుసగా నిర్వహించిన సమావేశాల్లో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్‌ ముందుగా వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యంగా జరిగినా.. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు నిర్దేశించినట్లు తెలిసింది.

Sonia Gandhi Letter To Modi : 'అజెండా చెప్పకుండా పార్లమెంటు సమావేశాలా?.. ఈ 9 అంశాలపై చర్చించండి!'

Last Updated :Sep 12, 2023, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.