ETV Bharat / state

BRS BJP Leaders Joining in Congress : అసంతృప్తులపైనే హస్తం టార్గెట్​.. బీఆర్​ఎస్​ను ఓడించడమే లక్ష్యం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 8:18 AM IST

BRS BJP Leaders Joining in Congress : అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ చేరికల విషయంలో ఆచితూచి ముందుకు వెళుతుంది. బీఆర్​ఎస్​, బీజేపీకి చెందిన పలువురు అసమ్మతి నాయకులు కాంగ్రెస్​లో చేరేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉండడంతో సీట్ల సర్దుబాటుపై పీసీసీ కసరత్తు చేస్తున్నట్లుసమాచారం.

Joinings in Congress
BRS BJP Leaders Joining in Congress

BRS BJP Leaders Joining in Congress అసంతృప్తులపైనే హస్తం టార్గెట్​.. బీఆర్​ఎస్​ను ఓడించడమే లక్ష్యం

BRS BJP Leaders Joining in Congress : బీఆర్​ఎస్​లో టికెట్లు రాక అసంతృప్తిగా ఉన్న నాయకులు, బీజేపీ నుంచి బరిలో నిలిచినా గెలిచే అవకాశం లేదని భావిస్తున్న నాయకులు కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చాలాకాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వాళ్లల్లో కొందరు పార్టీ మారేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీలో ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని భావిస్తున్న నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాళ్లు ఆ రెండు పార్టీల నుంచి దాదాపు 20 మంది ఉంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది.

Telangana Assembly Elections 2023 : ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న(Joinings in Telangana Congress) నాయకులను సర్వేల ద్వారా దాదాపుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేని నియోజకవర్గాలను పీసీసీ ఇప్పటికే గుర్తించింది. అసంతృప్తిగా ఉన్న నాయకులు సైతం బీఆర్​ఎస్ నాయకత్వంపై కసితో ఉంటుండడంతో సీట్ల సర్దుబాటు చేసి టిక్కెట్లు ఇవ్వగలిగితే పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా రహస్య మంతనాలు జరుగుతున్న విషయం బయటకు పోకుండా పీసీసీ జాగ్రత్త పడుతోంది.

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీల నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్​లోకి వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన అధికార పార్టీ…. బీఆర్ఎస్ నాయకులను పార్టీ మారకుండా అడ్డుకున్నారు. అదే విధంగా ఆ నాయకులకు పదవులు కూడా కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరిగినందువల్లనే ఆయా నాయకులు లబ్ధి పొందారని పీసీసీ భావిస్తుంది. అందువల్లనే చేరికల వ్యవహారం బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

BRS MLA Mynampally Meeting with Congress Leaders : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానంతోపాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించాలని పీసీసీ వద్ద డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి హరీష్​రావుపై తీవ్ర విమర్శలు చేసి బీఆర్ఎస్ (Mynampally Joining in congress) పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీతో సంప్రదించినట్లు తెలుస్తోంది. మెదక్, మల్కాజ్​గిరి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలని కోరుతుండగా మెదక్ అసెంబ్లీతోపాటు మల్కాజ్​గిరి పార్లమెంటు ఇవ్వడానికి పిసిసి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సీట్లు రెండు కావాలనుకుంటే మెదక్​తో పాటు కూకట్​పల్లి తీసుకోవాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

BRS MLA Rekha Naik Joining In Congress : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఖానాపూర్ సీటు కోసం పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే కూడా (MLA Rekha Naik)కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా సమాచారం. టికెట్ల సర్దుబాటు కాకపోవడంతో చేరికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే సైతం తనకు టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్​లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వానికి సంకేతాలు పంపారని తెలుస్తోంది. ఇది ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Congress MLA Candidates Selections Controversy : కాంగ్రెస్​లో 'డబుల్'​ ట్రబుల్​.. తెరపైకి కొత్త తరహా వివాదం

Congress MLA Candidates Selections Process : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. సెప్టెంబర్​ 2న మళ్లీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.