ETV Bharat / state

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 7:01 PM IST

Revanth Reddy on Congress Declarations 2023 : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభించామని.. తెలంగాణలోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

BJP And BRS Leaders Joined Congress
BJP And BRS Leaders Joined Congress In Gandhi Bhavan

Revanth Reddy on Congress Declarations 2023 : చేతి గుర్తు తమ చిహ్నం.. చేసి చూపించడమే తమ నైజమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో ఐదు హామీల్లో 4 హామీలను అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీ నేతలను గాంధీభవన్‌లో పార్టీ కండువా కప్పి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గృహలక్ష్మి పథకం(Gruhalaxmi Scheme in Karnataka) ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.

'కారు కూతలు రావు.. జూటా మాటలు లేవు.. తమ మాట శిలాశాసనం.. తమ బాట ప్రజా సంక్షేమం' అని రేవంత్​ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో 5 హామీల్లో 4 హామీలను అమలు చేశామన్నారు. తెలంగాణలోనూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు.

చేతి గుర్తు మా చిహ్నం. చేసి చూపించడమే మా నైజం. ఇచ్చిన మాట ప్రకారమే.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో.. నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం. 'కారు'కూతలు రావు.. 'జూటా' మాటలు లేవు.. మా మాట శిలాశాసనం.. మా బాట ప్రజా సంక్షేమం.. వస్తున్నాం తెలంగాణలోనూ.. అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను.. మోసుకొస్తున్నాం చిరునవ్వులను.-రేవంత్​ రెడ్డి ట్వీట్

  • 🔥చేతి గుర్తు మా చిహ్నం.
    చేసి చూపించడమే మా నైజం.

    ఇచ్చిన మాట ప్రకారమే..
    అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
    కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
    నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.

    'కారు'కూతలు రావు
    'జుటా' మాటలు లేవు

    మా మాట శిలాశాసనం..
    మా బాట ప్రజా సంక్షేమం..

    వస్తున్నాం… pic.twitter.com/cxADgi1pd7

    — Revanth Reddy (@revanth_anumula) August 30, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

T Congress focus on Joinings : బీజేపీ అసంతృప్తులకు.. హస్తం గాలం.. అంతా తెరవెనుక రాజకీయం

కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుంది : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ వాటిని అమలు చేస్తున్నామని కేసీఆర్‌, కేటీఆర్‌ కలల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్​ను అమలు చేయనుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంటే శాండ్‌, ల్యాండ్‌, లిక్కర్‌, కరెప్షన్‌ అని దుయ్యబట్టారు. ఫ్యామిలిలో ఒకే టికెట్‌ విషయంలో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌లో ఉందని.. ఏఐసీసీ నిబంధనల మేరకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టికెట్ల ప్రకటన చేయాలని ఏఐసీసీని కోరుతున్నానని తెలిపారు.

MLA Seethakka Fires on BRS Party : డబ్బు సంచులతో బీఆర్ఎస్ నన్ను టార్గెట్ చేస్తోంది: సీతక్క

Uttam Kumar Reddy comments on BRS : తెలంగాణలో ఇప్పుడిస్తున్న 6 కేజీల రేషన్‌లో 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలో భాగమైన దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూంలు లేవు.. కేజీ టూ పీజీ విద్య లేదు.. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు పెంచలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. ఉచిత ఎరువుల హామీకే పరిమితం అయిందన్నారు. బీఆర్‌ఎస్‌ హామీలలో 90 శాతం అమలు చేయలేదని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని కర్ణాటకలో ప్రారంభించామని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ హామీ ఇస్తే అమలు చేస్తోందని మరోసారి నిరూపితమైందని హర్షించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul On China New Map : 'మోదీవి అబద్ధాలని ఏళ్లుగా చెప్తున్నా.. చైనా మ్యాప్‌పై ప్రధాని ప్రకటన చేయాల్సిందే'

Congress MLA Candidates Selections Process : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. సెప్టెంబర్​ 2న మళ్లీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.