ETV Bharat / state

NVSS Prabhakar: 'కేసీఆర్​ ఏడేళ్ల పాలనలో జనాలు ఏడుస్తూనే ఉన్నారు'

author img

By

Published : Feb 11, 2022, 4:48 PM IST

nvss prabhakar on trs government
nvss prabhakar

NVSS Prabhakar: కేసీఆర్​ ఏడేళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ, దళిత, నిరుద్యోగ, రైతు ద్రోహిగా ప్రభుత్వం మారిందని ఆరోపించారు.

NVSS Prabhakar: రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెరాస ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ అన్నారు. నిజానికి ప్రజా ధిక్కారానికి పాల్పడుతున్నది సీఎం కేసీఆరేనని విమర్శించారు. నిరుద్యోగ, దళిత, బీసీల ద్రోహిగా.. కేసీఆర్​ను ప్రజల ముందు నిలబెడతామన్నారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.

'కేసీఆర్​ ప్రభుత్వం.. తెలంగాణ, దళిత, నిరుద్యోగ, రైతు ద్రోహిగా మారింది. కేసీఆర్​ ఏడేళ్ల పాలనలో జనం ఏడుస్తూనే ఉన్నారు. ప్రజలెవరూ సంతోషంగా లేరు. కేసీఆర్​ పర్యటిస్తున్నారంటే.. ప్రజలు, రైతులను ఆదుకుంటారని.. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని అనుకుంటాం. కానీ ఏడేళ్ల కాలంలో మంత్రుల ఆస్తులను పెంచుకోవడం, కార్యాలయాల్లో అంతస్తులను పెంచుకోవడమే ఈ ప్రభుత్వ ఘనతగా మారింది.'

- ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

NVSS Prabhakar: 'కేసీఆర్​ ఏడేళ్ల పాలనలో జనాలు ఏడుస్తూనే ఉన్నారు'

ఇదీచూడండి: ప్రివిలేజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.