ETV Bharat / state

Raghunandanrao: 'సీఎం కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేల చిట్టాను ఏసీబీ డీజీపీకి పంపించాలి'

author img

By

Published : Apr 28, 2023, 4:22 PM IST

MLA Raghunandanrao Fires on CM KCR: దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే బీసీ మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించిన సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ శాఖ మంత్రి మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఏసీబీ డీజీపీకి అవినీతి ఎమ్మెల్యేల చిట్టా సీఎం కేసీఆర్ పంపించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు ముందు నుంచే ఆరోపిస్తున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు.

Raghunandanrao
Raghunandanrao

MLA Raghunandanrao Fires on CM KCR: ఎమ్మెల్యేలు దళిత బంధులో రూ.3 లక్షల కమీషన్ తీసుకున్నారని.. వారి చిట్టా తన వద్ద ఉందని సీఎం కేసీఆర్.. బీఆర్​ఎస్ సమావేశంలో హెచ్చరించినట్లు అన్ని పత్రికల్లో వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దిన పత్రికల్లో వచ్చిన వార్తను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుని ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఏసీబీ డీజీపీకి అవినీతి ఎమ్మెల్యేల చిట్టా సీఎం కేసీఆర్ పంపించాలని రఘునందన్​ డిమాండ్ చేశారు.

ఆ మంత్రిపై ఆరోపణలు వస్తే సీఎం ఎందుకు స్పందించట్లేదు: దళిత బంధు పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు ముందు నుంచే ఆరోపిస్తున్నా పట్టించుకోలేదని రఘునందన్​రావు ధ్వజమెత్తారు. డబ్బులు ఇస్తేనే రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నారనీ ఆరోపించారు. ఇసుక, భూములు అమ్ముకొని, గొర్రెలు, బర్రెల స్కీంలతో మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి మీద వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవినీతి పేరుతో దళిత బిడ్డను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, బీసీ బిడ్డను మంత్రి పదవి నుంచి తీసివేశారన్నారు. బడుగు బలహీనవర్గాలకు ఒక న్యాయం.. ఉన్నత వర్గాలకు మరొక న్యాయమా అని నిలదీశారు. ఇది అవినీతికి పరాకాష్ట అని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే అక్టోబర్​లో ఎన్నికలు: నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయని రఘునందన్​రావు స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే అక్టోబర్​లో ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు. రూ.15 వందల కోట్లతో కట్టిన సచివాలయంలో ముఖ్యమంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయంలో కూర్చుంటే మే 1వ తేదీన దరఖాస్తు తీసుకుని వెళ్లి కలుస్తానన్నారు. సచివాలయం ప్రారంభం తరువాత అయినా సచీవుల పని తీరు మారాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు వ్యాఖ్యానించారు.

'కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే. నేను దుబ్బాక ఎమ్మెల్యే. కేసీఆర్ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఎవరైనా సభ్యత, సంస్కారంతో మాట్లాడాలి. అధికారంలోకి రాగానే ఏం చెప్పారు.. తప్పు ఎవరు చేసినా చర్యలన్నారు. మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిపై ఆరోపణలు వస్తే సమాధానం లేదు. నచ్చని వ్యక్తి అయితే వెంటనే చర్యలు తీసుకుని తొలిగిస్తారు. కమీషన్లు తీసుకున్నారని తెలిసీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. కమీషన్లపై సిట్‌ వేసి విచారణ చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నా. వ్యక్తిగతంగా దూషించడం, దాడులు చేయడమే మీ పనా ? పేద రైతుల భూములను అప్పనంగా అమ్ముకుంటున్నారు. ఇవేమీ కేసీఆర్‌కు పట్టవు. పార్టీ పేరు మార్చుకుని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు.'-రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా అ.ని.శా.కు ఇవ్వాలి: రఘునందన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.