ETV Bharat / state

BJP Maha Dharna at Indira Park : 'కేసీఆర్​ మరోసారి అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదు'

author img

By

Published : Aug 12, 2023, 3:32 PM IST

Updated : Aug 12, 2023, 6:19 PM IST

BJP Maha Dharna at Indira Park : డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట అసెంబ్లీ లోపల, బయట పేదలను మభ్యపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయని.. భూమి మీద ఉండవని ఎద్దేవా చేశారు. మరోసారి కేసీఆర్​ అధికారంలోకి వస్తే.. పేదల సొంతింటి కల ఎప్పటికీ తీరదన్నారు.

Kishan Reddy Speech at BJP Maha Dharna Indira Park
BJP Maha Dharna at Indira Park

BJP Maha Dharna at Indira Park : 'కేసీఆర్​ మరోసారి అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదు'

BJP Maha Dharna at Indira Park : రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. గత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్​ఎస్​ రెండు పడక గదుల ఇళ్ల హామీ ఇచ్చి విస్మరించిందని.. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్​రెడ్డితో పాటు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్​ ఈటల రాజేందర్​ సహా పలువురు జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరుపై కిషన్​రెడ్డి మండిపడ్డారు.

రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి : కిషన్​రెడ్డి

Kishan Reddy Speech at BJP Maha Dharna Indira Park : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయని.. భూమి మీద ఉండవని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్త శుద్ధి లేదని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే.. ఓట్లు అడగనని 2017లో కేసీఆర్‌ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రగతిభవన్‌ను 4 నెలలు, సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించారని.. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్ల సమయం పడుతోందని విమర్శించారు. అక్కడక్కడ కొన్ని కట్టినా.. ఆ ఇళ్లను ఇంకా ప్రజలకు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే మరోసారి కేసీఆర్‌ అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదని ఆక్షేపించారు.

రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది: కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయి.. భూమి మీద ఉండవు. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే.. ఓట్లు అడగనని 2017లో కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌ను 4 నెలలు, సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్లు పడుతోంది. అక్కడక్కడ కట్టినా.. ఇళ్లు ఇంకా ప్రజలకు పంపిణీ చేయడం లేదు. మరోసారి కేసీఆర్‌ అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదు. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Speech on National Handloom Day : 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చేనేత సంఘాలకి ఎన్నికలు నిర్వహిస్తాం: కిషన్ రెడ్డి

BJP Maha Dharna at Indira Park Hyderabad : ఈ క్రమంలోనే దళితబంధు పేరుతో దళితులను.. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను కేసీఆర్ దగా చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు వస్తాయన్నారు. 4 నెలల్లో ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్​కు.. పేదలకు ఇచ్చే ఇళ్లపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత తనదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు వస్తాయి. పేదలకు ఇచ్చే ఇళ్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత నాది. - కిషన్‌రెడ్డి

ఆ రూ.3 లక్షలతో పునాదులు కూడా పూర్తికావు..: గృహలక్ష్మి పథకంతో రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని.. ఆ డబ్బులతో ఇంటి పునాదులు కూడా పూర్తి కావని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే బడంగ్​పేట అసైన్డ్‌ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన ఆయన.. గ్రూపు 2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

కుట్రలు చేసి బీజేపీని అణచి వేయాలనేది కేసీఆర్ యోచన: కిషన్‌రెడ్డి

Kishan Reddy Fires on CM KCR : 'కేసీఆర్‌.. రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులిస్తున్నారు'

Last Updated :Aug 12, 2023, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.