ETV Bharat / state

రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి : కిషన్​రెడ్డి

author img

By

Published : Apr 4, 2023, 7:30 PM IST

kishanreddy
kishanreddy

Kishanreddy fires on BRS Government : అధికారంలో ఉండే ఆరు నెలలైన బీఆర్​ఎస్ సర్కారు అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి... రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే... కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు.

Kishanreddy fires on BRS Government : రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే... కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి.. ఎంఎంటీఎస్, ట్రిబుల్‌ ఆర్‌ రోడ్డు నిర్మాణం సహా పలు అంశాల్లో... కేసీఆర్‌ సర్కారు ఎటువంటి సహకారం అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్లి దిల్లీలో తాకట్టు : రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కిషన్‌ రెడ్డి హితవు పలికారు. అంబర్‌ పేట, ఉప్పల్‌ వద్ద... రోడ్డు నిర్మాణాలకు సంబంధించి.. రాష్ట్ర మంత్రులు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చురకలు అంటించారు. మోదీ హయాంలో... తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం.. గతం కంటే రెండింతలు అయ్యాయని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్లి దిల్లీలో మద్యం బాటిళ్లకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. పథకాలు సాధించినట్లు ఎన్ని ఫోన్లు వాడింది చూపించారని ఎద్దేవా చేశారు.

ఆరు నెలలైన అభివృద్ధికి సహకరించాలి : బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబ పార్టీలకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తా, ఛైర్మన్​గా ఉంటాననీ చెప్పినట్లు ప్రసార మాధ్యమాల్లో చుసానని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశంలోనీ అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడంటే.. బీఆర్​ఎస్ సర్కారు ఎన్ని వేల కోట్ల సంపాదించిందో అర్ధమవుతుందన్నారు. కేసీఆర్​కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండే ఆరు నెలలైన బీఆర్​ఎస్ సర్కారు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

'13 కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రారంభిస్తాం. ఈనెల 8న బీబీనగర్ ఎయిమ్స్‌ నూతన భవనానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.1,366 కోట్లతో ఎయిమ్స్‌ నూతన భవనానికి టెండర్లు పిలిచాం. ఉగాది కానుకగా వందే భారత్‌ రైలును ప్రారంభించాం. దేశంలో వంద వందే భారత్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నిర్ణయం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్ల నిర్మాణం. వందేభారత్‌ రైళ్లు ప్రజల ఆదరణ పొందాయి. తిరుపతికి పర్యాటకుల రద్దీ దృష్ట్యా వందేభారత్‌ రైలు ప్రారంభిస్తాం. బెంగళూరుకు వందేభారత్‌ రైలు నడపాలని సూచించా.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

సీఎం కేసీఆర్​కి ఆహ్వానం పంపాం : అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులను మోదీ ప్రారంభిస్తారని కిషన్​రెడ్డి అన్నారు. 7,864కోట్లతో జాతీయ రహదారులకు సంబంధించి భూమి పూజ, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ రైలును ప్రారంభిస్తారన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్​కి ఆహ్వానం పంపామని.. ఆయన రావాలని ఆశిస్తున్నామని కిషన్​రెడ్డి తెలిపారు.

'హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డు పనులు ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం. ఆర్‌ఆర్‌ఆర్‌ వస్తే పరిశ్రమలు, ఐటీ రంగం, టౌన్‌షిప్‌లు వస్తాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. తెలంగాణ అభివృద్ధిలో ఆర్‌ఆర్‌ఆర్‌ గేమ్‌ ఛేంజర్‌గా ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయితే అన్ని రకాలుగా హైదరాబాద్‌ అభివృద్ధికి వీలు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణ కోసం రూ.4 వేల కోట్లు అంచనా వ్యయం. భూసేకరణ కోసం 50 శాతం కేంద్రమే భరిస్తుంది. రోడ్డు నిర్మాణ పనుల వ్యయం కేంద్రమే భరిస్తుంది.'- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.