ETV Bharat / state

BJP Leaders Respond on Group 1 Prelims Exam Cancelled : 'రాష్ట్ర సర్కార్​ వైఫల్యం.. యువతకు శాపంగా మారింది'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 8:03 PM IST

Updated : Sep 23, 2023, 8:14 PM IST

Group 1 Prelims Exam Cancelled Telangana 2023
Kishan reddy on Group 1 Prelims Exam Cancelled

BJP Leaders Respond on Group 1 Prelims Exam Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై బీజేపీ నాయకులు స్పందించారు. పరీక్ష వాయిదా పడడం దురదృష్టకరమని కిషన్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు.

BJP Leaders Respond on Group 1 Prelims Exam Cancelled Telangana 2023 : గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. జూన్ 11న జరిగిన ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ(TSPSC)కి ఆదేశాలు జారీచేసింది. దీనిపై బీజేపీ నేతలు కిషన్​రెడ్డి, డీకే అరుణ(DK Aruna) వేర్వేరుగా స్పందించారు. రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష(Group-1 Preliminary Exam)ను రద్దు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి (Kishan Reddy) అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు.

TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ

Kishan Reddy on Group 1 Prelims Exam Cancelled : గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది నిరుద్యోగ యువతలో నైరాశ్యం నింపేలా.. కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువత భవిష్యత్​కు భద్రత, భరోసా కల్పించలేని తెలంగాణ సర్కార్.. అధికారంలో ఉండే నైతిక అర్హత లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగా పడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఉద్యోగాల విషయంలోనూ రాష్ట్ర సర్కార్​ వైఫల్యం.. యువతకు శాపంగా మారిందని కిషన్​రెడ్డి విమర్శించారు.

TSPSC Group 1 prelims Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ప్రాథమిక కీ విడుదల

గ్రూప్-1 పరీక్షలో.. అక్రమాలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవడం తప్పనిసరి అంటూ నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత బయోమోట్రిక్ తప్పనిసరి కాదంటూ వ్యవహరించడం.. యువతకు న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో.. బీఆర్ఎస్ సర్కార్ ఆలోచన సరళిని స్పష్టంచేస్తోందని తెలిపారు. హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్​ను తొలగించడం ద్వారా పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయిందని వివరించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయడం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

DK Aruna on Group 1 Prelims Exam Cancelled : రాష్ట్రంలో మరోసారి టీఎస్‌పీఎస్సీ గ్రూప్​-1 పరీక్ష రద్దుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓ ప్రకటనలో స్పందించారు. ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపట్ల చిత్తశుద్ధి లేదని అగ్రహం వ్యక్తం చేశారు. మద్యం నోటిఫికేషన్​పై ఉన్న శ్రద్ద.. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని దుయ్యబట్టారు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చవుతుందని.. రాష్ట్ర సర్కార్ కక్కుర్తిపడడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్​ -1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని.. ఈ ఘటనకు బాధ్యత వహించి ఛైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డీకే అరుణ పేర్కొన్నారు.

Group1 Prelims update : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి 2సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్​.. ఇంటర్​లో రెండు లాంగ్వేెజెస్​ నేర్చుకోవాల్సిందే!

Last Updated :Sep 23, 2023, 8:14 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.