ETV Bharat / state

'రైతులకు పంటకు అయ్యే ఖర్చు ఎక్కువ.. మిగులు తక్కువ'

author img

By

Published : Feb 13, 2021, 9:33 PM IST

దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల పరంగా సంక్షోభం లేదని, రైతుల ఆదాయం పరంగానే సంక్షోభం ఉందని... ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచందర్​ రావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్​లోని రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రంలో 'వ్యవసాయ సంక్షోభం, నూతన వ్యవసాయ చట్టాలు, రైతు పోరాటం' అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Awareness seminar on new agricultural laws in hyderabad
పంట పండించేందుకు ఖర్చు ఎక్కువ.. మిగులు మాత్రం తక్కువ

రైతులకు పంట పండించేందుకు ఖర్చు ఎక్కువ, మిగులు మాత్రం తగ్గిపోతోందని... ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచందర్​ రావు తెలిపారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల పరంగా సంక్షోభం లేదని, రైతుల ఆదాయం పరంగానే సంక్షోభం ఉందన్నారు. హైదరాబాద్ కొండాపూర్​లోని రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రంలో 'వ్యవసాయ సంక్షోభం, నూతన వ్యవసాయ చట్టాలు, రైతు పోరాటం' అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ముందుకు...

దేశంలో పంజాబ్​, హరియాణా, ఉత్తరప్రదేశ్​లకు చెందిన రైతులు 90శాతం కనీస మద్దతు ధరను సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. నూతన సాగు చట్టాల ద్వారా కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర తొలగిస్తుందనే అపోహ రైతులకు ఉందన్నారు. రైతు సంఘం నాయకులు కోరినట్టు చట్టాల అమలుకు మూడు సంవత్సరాలు వేచి ఉండాలని పేర్కొన్నారు. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ముందుకు వెళ్లాలని కోరారు.

ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర రావు అధ్యక్షత వహించారు. డాక్టర్ పూర్ణచందర్​ రావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్​ ప్రొఫెసర్ నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం: కొప్పుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.