ETV Bharat / state

'ఆధార్​ అప్​డేట్​ చేసుకోవడానికి మరో ఛాన్స్​'

author img

By

Published : Mar 12, 2021, 7:52 PM IST

ఆధార్​ కార్డులో పుట్టినతేదీ, వేలి ముద్రలు, వయసు తదితర వివరాలు అప్​డేట్​ చేసుకోవాలి అనుకునే వారికి గుడ్​ న్యూస్​. ఆ వివరాల అప్డే​ట్​ కోసం.. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 120 పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ జనరల్ కోరారు.

Another chance to update Aadhaar card update at hyderabad
'ఆధార్​ అప్​డేట్​ చేసుకోవడానికి మరో ఛాన్స్​'

కొత్త ఆధార్ నమోదు, పాత కార్డుల్లో సమాచారం అప్​డేట్ చేసుకోవటం కోసం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో.. 120 పోస్ట్ ఆఫీసు ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలు ఉన్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు. 5 లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన వారు తప్పనిసరిగా వేలి ముద్రలను అప్​డేట్​ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సేవలను ఆయా కేంద్రాల్లో అందించనున్నట్లు వెల్లడించారు.

సమాచారం అప్​డేట్ కోసం వచ్చేవారు రూ.50, వేలి ముద్రలు/ఐరిస్ సేవల అప్​డేట్ కోసం రూ.100 ఛార్జీ వసూలు చేయనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ వివరించారు.

ఇదీ చూడండి : బైక్​ను ఢీకొన్న కంటైనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.