ETV Bharat / state

సెప్టెంబర్ 16న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక

author img

By

Published : Sep 6, 2022, 7:30 PM IST

అమిత్ షా
అమిత్ షా

Amit Shah Come To Hyderabad On 16th: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్నారు. సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు.

Amit Shah Come To Hyderabad On 16th: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్నారు. సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భాజపా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.

మునుగోడు ఉప ఎన్నికపై భాజపా కోర్​ కమిటీలో చర్చ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నిక అంశంపైనే ప్రధానంగా చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో చర్చించి పూర్తిస్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 11న మునుగోడుకు బండి సంజయ్‌ వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని భాజపా కోర్ కమిటీలో నిర్ణయించారు.

ఈ నెల 15న హైదరాబాద్ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ వద్ద ఉన్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు భాజపా ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భాజపా కోర్​ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇలా..: మరోవైపు తెలంగాణ సమాజం రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించింది. 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది.

ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నగర, పురపాలక, పంచాయతీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇవీ చదవండి:'కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారు'

భారత్​- బంగ్లా మధ్య కీలక ఒప్పందం.. కుషియారా నదీజలాల విషయంలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.