ETV Bharat / state

' జూన్​ 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలి'

author img

By

Published : Jun 4, 2021, 7:23 PM IST

A statewide protest is scheduled for June 5
' జూన్​ 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలి'

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా జూన్ 5న చేపట్టిన ఉద్యమానికి సంవత్సరం అయిన నేపథ్యంలో… రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం, రాష్ట్ర వ్యవసాయ సంఘం, సీఐటీయూ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్ జవహర్ నగర్​లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘాల నాయకులు గోడ పత్రికను విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఈ నెల 5 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా… చట్టాల ప్రతులను జిల్లా, మండల, గ్రామా స్థాయిలో దగ్ధం చేసి నిరసన తెలపాలని.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యస్.రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్​లు పేర్కొన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్​లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘాల నాయకులు గోడ పత్రికను ఆవిష్కరించారు.

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల అమలుతో లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని ధ్వంసం చేసి సమాజానికి హాని కలిగిస్తారని వారు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ సుస్థిరత సమస్యలను నొక్కి చెప్పడానికి… జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున… సంపూర్ణ క్రాంతి దివాస్ పేరుతో వ్యవసాయ నల్ల చట్టాల ప్రతులను దగ్ధం చేస్తూ వివిధ రకాల మొక్కలను నాటాలని సూచించారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ… రైతు సంఘాల గ్రామ మండల కమిటీలు సమన్వయంతో విజవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లారీ టైర్ల మధ్యలో ఇరికి యువకుడి క్షోభ.. చివరికి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.