ETV Bharat / state

స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ.. వ్యక్తి మృతి

author img

By

Published : Mar 1, 2023, 4:49 PM IST

Hyderabad
Hyderabad

A Person Died While Playing Badminton: నేటి ఆధునిక కాలంలో గుండెపోటు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలా మంది యువకులు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే మరణిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆట ఆడుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

A Person Died While Playing Badminton: మృత్యువు ఎప్పుడూ ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టమని పెద్దల వాదన. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా.. అనారోగ్యంగా ఉన్నాడా అనే తేడా లేకుండా హఠాత్తుగా మరణిస్తారు. నేటీ ఆధునిక జీవనంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, విభిన శైలుల కారణంగా మానవుడు 60 సంవత్సరాల జీవితాన్ని కూడా బతకడం కష్టంగా మారుతోంది. ఈ మధ్య చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వారి వరకు ఎక్కువ మంది మరణానికి గుండెపోటు కారణమవుతోంది.

కొవిడ్ తర్వాత ప్రజలూ ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగా సారించారు. ఇందులో భాగంగానే చాలా మంది వ్యామాయాలు, వివిధ క్రీడలను హాబీగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరూ జిమ్ చేస్తూనే.. మరి కొందరూ ఆటలు ఆడుతూనే కుప్పకూలి హఠాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ మరణించాడు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్​కు చెందిన పరమేష్ యాదవ్ లాలాపేట్​లోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వాళ్లు గమనించి అప్పటికే మృతిచెందాడు. వెంటనే వారు లాలాగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవలే గత నెల 24న హైదరాబాద్​లో విశాల్ అనే కానిస్టేబుల్​లో జిమ్​లో వ్యాయమం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ఆ నొప్పిని భరించలేక ప్రాణాలు వదిలాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే విశాల్ గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి విషాదమే జరిగింది.పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ పెళ్లి కుమారుని సమీప బంధువైన ముత్యం అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు.

నేటి ఆధునిక కాలంలో గుండెపోటు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురిచేస్తోంది. యువత నుంచి వృద్ధుల వరకు చాలా మంది అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. కొందరు చాలా ఫిట్​గా ఉన్నా గుండెపోటుకు గురవుతున్నారు. అయితే రోజూ తీసుకునే అనవసరపు ఒత్తిడి, ఆహారం, జీవనశైలి, ఇలా అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలోనే గుండెపోటు రాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: CCTV Footage : జిమ్​లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

మూడేళ్లుగా బాలికపై తండ్రి అత్యాచారం.. పరీక్ష రాయకుండా ఠాణాకెళ్లి ఫిర్యాదు.. తల్లి కూడా అలా చేసిందంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.