ETV Bharat / state

సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మా.. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లితో విద్యార్థిని

author img

By

Published : Feb 26, 2023, 9:39 AM IST

Updated : Feb 26, 2023, 11:29 AM IST

A medical student who spoke to her mother the day before the suicide attempt
ఆత్మహత్యాయత్నం ముందు రోజు తల్లితో మాట్లాడిన వైద్య విద్యార్థిని

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆత్మహత్యాయత్నం ముందు రోజు తల్లితో వైద్య విద్యార్థిని మాట్లాడినట్లు తెలుస్తోంది. ఫోన్‌లో తన బాధను తల్లితో పంచుకుంది. సైఫ్తో తనతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని ఆవేదన చెందింది.

KMC Pg Medical Student Suicide attempt Update: సీనియర్ వేధింపులు తాళలేక వరంగల్​ ఎంజీఎంలో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం పీజీ విద్యార్థిని నిమ్స్​లో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో పలు ఆసక్తి కర విషయాలు బయటకు వచ్చాయి. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు రోజు తల్లితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఫోన్‌లో వైద్య విద్యార్థిని తన బాధను తల్లితో పంచుకున్నట్లు ఆడియో బయటకు వచ్చింది. సైఫ్ నాతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని పేర్కొంది. సీనియర్లు అంతా ఒకటిగా ఉన్నారని ఆవేదన చెందింది. పోలిసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని తెలిపింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లి వద్ద బాధపడ్డ వైద్య విద్యార్థిని బాధ పడింది.

సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటై తనను దూరం పెడతారని ఆవేదన చెందింది. ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్‌వోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఈ మాటలు విన్న తల్లి... సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని కూతురికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వైద్య విద్యార్థిని మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.

నాలుగు రోజులుగా ఏఆర్‌సీయూలో వెంటిలేటర్‌, ఎక్మో యంత్రం సాయంతో ప్రత్యేక వైద్య బృందం వైద్య విద్యార్థినికి చికిత్స చేస్తోంది. ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తొలుత ఎంజీఎంలో ఒక సారి గుండె ఆగిపోగా.. నిమ్స్‌లో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు గుండె అయిదుసార్లు ఆగిపోయినట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్‌ చేసి పనిచేసేలా చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌, ఎక్మో యంత్రంపై ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వివరించారు. వైద్యవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లితో విద్యార్థిని ఆడియో

ఇవీ చదవండి:

Last Updated :Feb 26, 2023, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.