ETV Bharat / state

Paleru Ex MLA First Death Anniversary Meeting : తనకోసం కాకుండా ప్రజలకోసం బతికిన వ్యక్తి భూపతిరావు : జస్టిస్ వేణుగోపాల్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 9:19 PM IST

Paleru Ex MLA First Death Anniversary Meeting
Paleru Ex MLA

Paleru Ex MLA First Death Anniversary Meeting : పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు ప్రథమ వర్ధంతి సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్య వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

Paleru Ex MLA First Death Anniversary Meeting : పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధులు, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి కీర్తిశేషులు భీమపాక భూపతిరావు(Bhimapaka Bhupathi Rao) ప్రథమ వర్ధంతి సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించారు. భీమపాక భూపతిరావు కుమారుడు హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. భూపతిరావు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1983లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పాలేరు శాసనసభ్యుడిగా గెలుపొందారు.

Bhimapaka Bhupathi Rao First Death Anniversary Meeting : భద్రాచలంలో ఈయన కృషి ఫలితంగా ఏర్పడిన కాలనీకి భూపతిరావుకాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ భీమపాక నగేశ్‌ ఈయన మూడో కుమారుడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్(Telangana High Court Judge Venugopal), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Leader Kunamneni Sambasiva Rao), భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్య వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

Justice Venugopal on Bhupathi Rao Death Anniversary : ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తనకోసం తను ఆలోచించకుండా ప్రజల బాగు కోసం జీవితకాలం పనిచేసిన నాయకుడు భీమపాక భూపతిరావు అన్నారు.

'తనకోసం తను బతికేవాడు శివాజీ.. ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి శివాజీ అని ఆ తల్లి చెప్పింది. తనకోసం కాకుండా ప్రజల కోసం బతికిన వ్యక్తి మహానీయుడు భీమపాక భూపతిరావు. ఆనాటి రోజుల్లో వారు ముందు నిలబడి బయలుదేరి అందరికీ పట్టాలు ఇప్పించిన ఘనత భూపతిరావుది.' -జస్టిస్ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తి

అనంతరం ఇతర ప్రముఖులు మాట్లాడుతూ.. భూపతిరావు ప్రజల కోసం చేసిన అనేక కార్యక్రమాలను వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు, న్యాయవాదులు రాజకీయవేత్తలు, పట్టణవాసులు, కీర్తిశేషులు భీమపాక భూపతిరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

'భూపతిరావు ఉంటే అదొక ధైర్యం ఆయన ఉన్నప్పుడు.. ఎంత కష్టమైన సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో చెప్పేవారు. తనకోసం ఆలోచించకుండా ప్రజల బాగు కోసం జీవితకాలం పనిచేసిన నాయకుడు భూపతిరావు.' -కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Paleru Ex MLA First Death Anniversary Meeting తనకోసం కాకుండా ప్రజలకోసం బతికిన వ్యక్తి భూపతిరావు జస్టిస్ వేణుగోపాల్

Rajeev Gandhi Death Anniversary Celebrations : రాజీవ్​గాంధీకి కాంగ్రెస్​ నేతల ఘన నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.