ETV Bharat / state

'సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచకపోతే ఉపేక్షించేది లేదు'

author img

By

Published : Jul 10, 2020, 1:59 PM IST

Updated : Jul 10, 2020, 9:53 PM IST

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మితమవుతున్న సీతారామ ప్రాజెక్టును మంత్రి పువ్వాడ అజయ్​కుమార్,​ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్​ సందర్శించారు. నిధుల సమస్యలేకున్నా... ఇసుక కొరత లేకున్నా... కూలీలు, కరోనా ప్రభావం సాకు చెప్పి పనుల్లో జాప్యం చేస్తున్నారంటూ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ajay
ajay

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ఆశించిన మేర సాగడం లేదని మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధుల సమస్య లేకున్నా... ఇసుక కొరత లేకున్నా... కూలీలు, కరోనా ప్రభావం సాకు చెప్పి పనుల్లో జాప్యం చేస్తున్నారంటూ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి మూడేళ్లు గడుస్తున్నా.... కేవలం 60 శాతం మేర పనులు మాత్రమే జరిగాయని, మిగతా 40 శాతం మేర పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు.

ఇకపై పనులు వేగం పుంజుకోకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని మంత్రి పువ్వాడ అజయ్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పరిశీలించారు. అశ్వాపురం, ముల్కలపల్లి మండలాల్లో నిర్మిస్తున్న పంప్​హౌజ్ పనులు పర్యవేక్షించి... కాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పంప్​హౌస్ వద్దనే అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పంతో ఉందని... ఈమేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి: షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

Last Updated : Jul 10, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.