ETV Bharat / state

Five died due to Sunstroke in TS : రాష్ట్రంలో వడదెబ్బతో అయిదుగురు మృతి

author img

By

Published : May 20, 2023, 9:29 AM IST

Survivors of sunburn in Telangana
Survivors of sunburn in Telangana

Five died due to Sunstroke in telangana : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక రాష్ట్రంలో అయిదుగురు వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నెలాఖరు వరకు ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Five died due to Sunstroke in telangana: రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున.. తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

high temperature in Telangana :రాష్ట్రంలో శుక్రవారం రోజున ఎండలు దంచికొట్టాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వడ దెబ్బ తగిలి అయిదుగురు మృతి చెందారు. ఒక్క గ్రామంలోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో తన్నీరు మనోహర్​(47), బేతం చిన్ని(56), అచ్చె రామారావు(74)లు వడదెబ్బకు బలైపోయారు. మహబూబాబాద్ జిల్లా​ గాంధీపురంలో వ్యవసాయ కూలి గండమల్ల వెంకటయ్య (67).. హైదరాబాద్​లోని ఫతేనగర్​లో శివాలయం రోడ్​లోని జామియా మసీద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(55) వడదెబ్బ తగిలి చనిపోయారు.

Five died due to Heat stroke in telangana : మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో నల్గొండ జిల్లా విలవిలలాడుతోంది. శుక్రవారం దామరచర్లలో 45.4, నేరేడుగొమ్ములో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్​ జిల్లా వీణవంకలో 45.4, నిర్మల్​ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కుమురంభీం, పెద్దపల్లి, ఆసిఫాబాద్​, సూర్యపేట, నిజామాబాద్​, జగిత్యాల జిల్లాలో 44.3 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం రోజున బయల్దేరిన ఈ రుతు పవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్​ దీవులు, దక్షిణ అండమాన్​ సముద్రంలోని కొన్ని ప్రదేశాలకు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్​ మొదటి వారంలో కేరళను తాకవచ్చని అంచనా వేస్తోంది

మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా.. ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పాటు రాష్ట్రం వైపు వాయువ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో దక్షిణ, తూర్పు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.