weather report of telangana : రాష్ట్రంలో భానుడి భగభగలు.. మరోవైపు వాతావరణ శాఖ శుభవార్త
Updated: May 18, 2023, 8:00 PM |
Published: May 18, 2023, 7:59 PM
Published: May 18, 2023, 7:59 PM

Weather Report of Telangana : రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండి పోతున్నాయి. పది తర్వాత ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సెగలు కక్కుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఎండలు కాస్తున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది అధికంగా ఎండలు కాయడం కాస్త గుబులు కలిగిస్తోంది. వడదెబ్బతో కొంతమంది ప్రజలు చనిపోతున్నారు.

1/ 12
Weather Report of Telangana : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటితే చాలు భానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతన్నాయి. ఈరోజు నల్గొండ జిల్లా నిడమనూరు 45.9, కరీంనగర్ జిల్లా తంగుల 45.6, సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం 45.4, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి 45.1, జగిత్యాల జిల్లా ధర్మపురి 44.5, వనపర్తి జిల్లా కన్నాయిపల్లి 44.4, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల 44.3 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ ప్రకటించింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ఒకటి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నదని తెలిపింది.

Loading...