ETV Bharat / state

DH Srinivas Rao Latest Comments : 'సీఎం ఛాన్స్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా'

author img

By

Published : Jun 11, 2023, 9:03 AM IST

Updated : Jun 11, 2023, 12:02 PM IST

DH Srinivas Rao to contest from Kothagudem : ఇటీవల కాలంలో సంచలన ప్రసంగాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాస్‌రావు.. మరోసారి ప్రచారంలోకెక్కారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అవకాశమిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

DH Srinivas Rao On BRS
DH Srinivas Rao On BRS

DH Srinivas Rao on contesting from Kothagudem : మూడోసారి అధికారపగ్గాలు చేపట్టి.. హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కొన్ని స్థానాల్లో మార్పులు-చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొత్త వారికి కూడా అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌(డీహెచ్‌) డా.గడల శ్రీనివాసరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్​ఎస్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

DH Srinivas Rao on Contesting in Assembly Elections 2023 : ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న డీహెచ్​ శ్రీనివాస్‌రావు.. మరోసారి ప్రచారంలోకెక్కారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ అవకాశమిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. శనివారం రోజున కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీలోని ‘జనహితం’ కార్యాలయంలో పాల్గొన్న ఆయన.. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్​ఆర్ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరఫున పోటీ చేసే ఆలోచన తనకి లేదని వివరించారు.

DH Srinivas Rao Latest Comments : ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్‌, సుదూర ప్రాంతాలకు తరలివెళ్తున్నారన్న ఆయన.. ఈ నేపథ్యంలో 'కొత్త కొత్తగూడెం' నిర్మాణమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వాటి గురించి నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు.

మరోవైపు గతంలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు రాజకీయంగా చర్చనీయంగా మారాయి. ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా కరోనా పరిస్థితులు, వైద్య శాఖ పర్యవేక్షణతో పాటు తాయత్తులు, పూజలంటూ చేసిన ప్రసంగాలతో డీహెచ్​ శ్రీనివాస్‌రావు గత కొన్నాళ్లుగా తరచుగా ప్రచారాల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అక్కడి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి.

DH Srinivas Rao Comments on BRS MLA : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పర్యటించిన ఆయన.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఇదే తమ చివరి పోటీ అని చెప్పిన స్థానిక శాసనసభ్యులు ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆరోపించారు. లాస్ట్‌ ఛాన్స్‌.. లాస్ట్​ చాన్స్​ అంటూ.. ఇంకెన్ని ఛాన్స్‌లు అడుగుతారంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తన సమావేశానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారని.. ప్రభుత్వ పథకాలు, దళిత బంధు వంటివి అందకుండా చేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి తీరుకు ప్రజలు భయపడొద్దని సూచించారు. తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా ? అంటూ కార్యక్రమానికి వచ్చిన వారిని డీహెచ్‌ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 11, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.