ETV Bharat / state

కలకలం రేపుతోన్న పులి సంచారం... లేగదూడ బలి

author img

By

Published : Dec 16, 2020, 1:00 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలోని భీంపూర్​ మండలం గొల్లఘాట్​ శివారులో పులి దాడిలో మరో లేగ దూడ బలైంది. వరస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.

tiger halchal and calf died in gollaghat adilabad district
కలకలం రేపుతోన్న పులి సంచారం... లేగదూడ బలి

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గొల్లఘాట్‌ శివారులో పులి దాడిలో మరో పశువు చనిపోయింది. రెండ్రోజుల క్రితం తాంసి కే అటవీ శివారులో ఓ లేగ దూడ పులి దాడిలో మృతిచెందగా... వరుస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మహారాష్ట్ర సరిహద్దు అభయారణ్యం నుంచి పులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని... పశువులను అటవీ ప్రాంతం వైపు తీసుకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.