ETV Bharat / state

తెరుచుకున్న ఆలయాలు.. భౌతికదూరంలో భక్తులు

author img

By

Published : Jun 8, 2020, 1:17 PM IST

less devotees in adilabad temples which opened after lockdown
తెరుచుకున్న ఆలయాలు.. పదుల సంఖ్యలో భక్తులు

ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. కోరనాకు భయపడిన భక్తులు అంతంతమాత్రంగానే దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు మాస్కులు ధరించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. థర్మల్ స్క్రీనింగ్​ చేశాకే దర్శనానికి అనుమతిస్తున్నారు.

లాక్​డౌన్​ వల్ల రెండున్నర నెలల పాటు మూతపడిన ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్​ వ్యాప్తికి భయపడిన భక్తులు పదుల సంఖ్యలోనే దర్శనమిచ్చారు. ఆలయాల్లో ఎలాంటి అభిషేకాలు గానీ, గుడిగంటలు మోగించకూడదనే కేంద్ర సూచనలను ఆదిలాబాద్​ జిల్లాలో భక్తులు పాటిస్తూ మూలవిరాట్టును దర్శించుకున్నారు.

పట్టణంలోని అన్ని మందిరాల్లో థర్మల్​ స్క్రీనింగ్​ చేశాక, మాస్కులు ధరిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుతిస్తున్నారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా అధికారులు గుండ్రటి సున్నాలు గీశారు. పదేళ్లలోపు చిన్నారులు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించట్లేదని ఆలయాల అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.