ETV Bharat / state

పత్తి రైతుల పరేషాన్‌: కొనుగోళ్లు లేక అన్నదాతల ఆందోళన

author img

By

Published : Oct 17, 2020, 3:46 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 19 నుంచి ప్రారంభించాల్సిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికే చేతికొచ్చిన పంటను భారత పత్తి సంస్థ(సీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ఆరబెట్టుకున్నారు. హైదరాబాద్‌లో వర్షాల కారణంగా కొనుగోళ్లు చేపట్టలేమని అధికారులు ప్రకటించడం వల్ల పత్తి నిలువలను ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు.

cutton farmers suffering in adialabad district
పత్తి రైతుల పరేషాన్‌: కొనుగోళ్లు లేక ఆందోళనలో అన్నదాతలు

పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోల్లు ఇంకా ప్రారంభం కాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా పత్తిని ఆరబెట్టినా కొనటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం కజ్జర్ల ఇళ్లల్లో స్థలాలు సరిపోక రామాలయం ఆవరణలో పత్తిని ఆరపెట్టుకొని పడిగాపులు కాస్తున్న రైతులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

పత్తి రైతుల పరేషాన్‌: కొనుగోళ్లు లేక ఆందోళనలో అన్నదాతలు

ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.