ETV Bharat / state

'పౌరసత్వ సవరణ చట్టాన్ని విరమించుకోవాలి'

author img

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

all party leaders protest against cab
ఉట్నూరులో అఖిల పక్ష నేతల ఆందోళన

ముస్లింలకే కాకుండా రాబోయే రోజుల్లో అందరిపైన ప్రభావం చూపే పౌరసత్వ సవరణ చట్టాన్ని విరమించుకోవాలని ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​లో అఖిలపక్షం నేతలు డిమాండ్​ చేశారు.

ఉట్నూరులో అఖిల పక్ష నేతల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలంలో అఖిల పక్ష నేతలు ఆందోళనకు దిగారు. మసీదు నుంచి వినాయకచౌక్​ వరకు ర్యాలీగా తరలివెళ్లారు.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అఖిలపక్ష నేతలు అన్నారు. మోదీ విధానాలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

Intro:సి ఏ ఎం ఆర్ సి వద్దు
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ముస్లింలకే కాదు రాబోయే రోజుల్లో అన్ని మతాల వారి పై ప్రభావం చూపే పౌరసత్వ సవరణ చట్టం జాతీయ ఆలోచనను విరమించుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని మసీదు నుంచి వినాయక్ చౌక్ వరకు భారీ గారితో ముస్లిం పెద్దలు చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో లో కాంగ్రెస్ తెరాస తో పాటు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉట్నూర్ ఎంపీపీ జయవంత్ రావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ఆత్రం భుజంగరావు ఏజెన్సీ ఎస్సీ ఎస్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ మైనార్టీ సంఘం నాయకుడు సయ్యద్ కరీమ్ తో పాటు పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు . దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ ఆందోళన జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ప్రశాంతంగా ఉన్న దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని హోంమంత్రి అమిత్ షా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేసే దాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


Body:రాజేందర్ కంప్యూటర్


Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.