ETV Bharat / sports

Tokyo Olympics Live: హాకీ, రెజ్లింగ్​లో ఓటమి- అథ్లెటిక్స్​లోనూ నిరాశ

author img

By

Published : Aug 6, 2021, 7:24 AM IST

Updated : Aug 6, 2021, 6:16 PM IST

hockey
హాకీ

18:12 August 06

ఆసియా రికార్డు కానీ..

పురుషుల 4X400 మీ. హీట్స్​లో భారత రన్నర్లు నిరాశపర్చారు. రౌండ్​ 1 హీట్​ 2లో 3:00:25 టైమింగ్​తో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్​కు చేరుకోలేకపోయారు. ఇది ఏషియన్​ రికార్డు. 8 మంది ఫైనల్​కు వెళ్లగా.. భారత జట్టు 9వ స్థానంలో నిలిచింది. 

18:08 August 06

20 కి.మీ. నడకలో..

మహిళల 20 కి.మీ. రేస్​ వాకింగ్​ ఫైనల్​లో భారత అథ్లెట్లు నిరాశపర్చారు. ప్రియాంక గోస్వామి 1:32:36 టైమింగ్​తో 17వ స్థానం, 1:37:38 టైమింగ్​తో భవ్నా జాట్​ 32వ స్థానంలో నిలిచారు. 

15:17 August 06

భారత్​కు నిరాశ- సెమీస్​లో బజరంగ్​ ఓటమి

భారత స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో ఓడాడు. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు. బజరంగ్​ ఇక కాంస్య పతకం కోసం ఆడనున్నాడు.  

10:15 August 06

సెమీస్​కు భజరంగ్

భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా టోక్యో ఒలింపిక్స్​లో సత్తాచాటుతున్నాడు. పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. పిన్‌డౌన్‌ సాయంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4:46 నిమిషాల్లోనే పోరు ముగించాడు. సెమీస్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అలియెవ్‌ హజీతో తలపడనున్నాడు.

09:10 August 06

bajrang
భజరంగ్

భజరంగ్ పూనియా గెలుపు

పురుషుల ఫ్రీ స్టైల్​ 65 కిలోల విభాగంలో భజరంగ్​ పూనియా అదరగొట్టాడు. కజకిస్థాన్ రెజ్లర్ ఎర్నాజర్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించాడు. దీంతో క్వార్టర్స్​కు అర్హత సాధించాడు పూనియా.

08:45 August 06

అమ్మాయిల ఓటమి

ఒలింపిక్స్​లో భారత మహిళల హాకీ జట్టు నిరాశపరిచింది. కాంస్య పతకం కోసం శుక్రవారం జరిగిన పోరులో గ్రేట్​ బ్రిటన్​ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలైంది. దీంతో పతకం సాధించకుండానే ఇంటిముఖం పట్టింది.

08:20 August 06

సీమ బిస్లా ఓటమి

మహిళల ఫ్రీస్టైల్ 50కిలోల విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్లో సీమ బిస్లా ఓటమిపాలైంది. ట్యునిషియాకు చెందిన సర్ర హమ్ది చేతిలో 1-3 తేడాతో పరాజయం చెందింది.

08:14 August 06

సమంగా ఇరుజట్లు

మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్-బ్రిటన్ చెరో 3 గోల్స్​తో సమంగా నిలిచాయి. దీంతో నాలుగోదైన చివరి క్వార్టర్ కీలకంగా మారనుంది.

07:21 August 06

భారత్ సెల్ఫ్ గోల్

రెండో క్వార్టర్ ప్రారంభంలోనే భారత జట్టు సెల్ఫ్ గోల్​తో ప్రత్యర్థి జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చుకుంది. తర్వాత దూకుడు ప్రదర్శించిన ఇండియా మూడు గోల్స్ చేసింది. దీంతో ప్రస్తుతానికి 3-2 గోల్స్ తేడాతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. 

07:18 August 06

గోల్స్​ కోసం ప్రయత్నం

కాంస్య పతకం కోసం జరుగుతోన్న పోరులో భారత్-గ్రేట్ బ్రిటన్ జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొదటి క్వార్టర్ ముగిసే సరికి ఇప్పటివరకు ఏ జట్టూ గోల్ చేయలేదు. 

07:16 August 06

కాంస్యం తెస్తారా?

ఒలింపిక్స్​లో సెమీస్​లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. తమ వీరోచిత పోరాటంతో యావత్​ దేశప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అయితే దేశానికి పతకం అందించాలన్న పట్టుదలతో కాంస్య పోరుకు సిద్ధమయ్యాయి. అనుకున్నట్లే.. పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్​లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. 41ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి ఇదే తొలి పతకం. అలాగే మహిళల జట్టు కూడా శుక్రవారం జరుగుతోన్న పోరులో గ్రేట్​ బ్రిటన్​ను ఎదుర్కొని సత్తా చాటాలని కసిగా ఉంది. కాగా, దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్​ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేసింది కెప్టెన్​ రాణిరాంపాల్​. మరి ఈ ఉత్కంఠ పోరులో మన మహిళలు పతకాన్ని సాధించి దేశ ప్రజల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.

Last Updated : Aug 6, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.