ETV Bharat / sports

Tokyo Olympics 2020: మహిళలు అదరగొడతారా?- గెలిస్తే చరిత్రే..

author img

By

Published : Aug 4, 2021, 5:20 AM IST

Updated : Aug 4, 2021, 7:33 AM IST

oly
ఒలింపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​లో 12వ రోజు భారత్.. పలు క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందులో మహిళల హాకీ మ్యాచ్​తో పాటు బాక్సింగ్​, జావెలిన్ త్రో, రెజ్లింగ్​, గోల్ఫ్​ పోటీలు ఉన్నాయి. అయితే కోట్లాది భారతీయుల ఆశలు.. హాకీ మహిళలు, బాక్సర్​ లవ్లీనాపైనే ఉన్నాయి.

టోక్యో ఒలింపిక్స్​ పన్నెండో రోజుకు చేరుకుంది. పతకాల కోసం భారత్​ ఇంకా ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. ఈ విశ్వక్రీడలు మొదలై 11రోజులు ముగిసినా ఇప్పటికీ మనం రెండు మెడల్స్ మాత్రమే సాధించాం. వెయిట్​ లిఫ్టింగ్​లో మీరాబాయి చాను తొలి పతకం(రజతం) సాధించగా.. షట్లర్​ పీవీ సింధు కాంస్యం నెగ్గింది. అయితే ఇప్పుడు (ఆగస్టు 4) మరికొంతమంది భారత అథ్లెట్లు పోటీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ పోటీల్లో ముఖ్యంగా హాకీ, బాక్సింగ్​, జావెలిన్​ త్రో మ్యాచ్​ల కోసం యావత్​ దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. వీరిపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి వీరు పతక ఆశల్ని సజీవం చేస్తారో లేదో చూడాలి.

హాకీపై భారీ ఆశలు

హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్​లో సోమవారం(ఆగస్టు 2) జరిగిన క్వార్టర్స్​లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబరు.2 ఆస్ట్రేలియాపై నెగ్గి సెమీస్​ చేరింది. విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్​కు చేరడం ఇదే తొలిసారి. బుధవారం(ఆగస్టు 3న) జరగబోయే సెమీస్​లో గెలిస్తే ఫైనల్​కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించినట్లవుతుంది.

లవ్లీనా ఏం చేస్తుందో?

బాక్సింగ్‌ విభాగంలో ఇప్పటికే లవ్లీనా భారత్​కు పతకం ఖాయం చేసింది. క్వార్టర్స్​లో చైనీస్​ తైపీ బాక్సర్​పై 4-1 తేడాతో గెలిచిన ఈమె.. సెమీస్​లో 69 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్​ సుర్మేనేలి బుసానాజ్​తో తలపడనుంది. అందులో గెలిస్తే ఫైనల్​కు దూసుకెళ్తుంది​. ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది. అయితే ఆమె స్వర్ణం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మరి ఏం చేస్తుందో చూడాలి.

lovlena
లవ్లీనా

బుధవారం జరగబోయే పోటీ వివరాలు ఇవే..

అథ్లెటిక్స్​- పురుషుల జావెలిన్​ త్రో (ఉదయం 5.35 నుంచి)

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏలో నీరజ్​ చోప్రా పాల్గొననున్నాడు. ఈ ఈవెంట్​​ ఉదయం 5.35 గంటల నుంచి జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు.

neeraj
నీరజ్​ చోప్రా

ఉదయం 7.05 గంటలకు గ్రూప్​ బిలో శివ్​పాల్​ సింగ్ బరిలో దిగుతాడు. ​

గోల్ఫ్​- మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్-​ 1

అదితి అశోక్ - ఉదయం 5.55 నుంచి

దీక్షా దగర్- ఉదయం 7.39 నుంచి

రెజ్లింగ్​- ఉదయం 8 నుంచి

రవి దహియా- పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్​ 1/8 ఫైనల్​& క్వార్టర్​ ఫైనల్​

అన్షు మలిక్​- మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్​ 1/8 ఫైనల్​& క్వార్టర్​ ఫైనల్​

దీపక్​ పునియా- పురుషుల 86 కేజీల ఫ్రీస్టైల్​ 1/8 ఫైనల్​& క్వార్టర్​ ఫైనల్​

(సెమీఫైనల్స్​ మధ్యాహ్నం 2.45 నుంచి)

బాక్సింగ్​- లవ్లీనా బోర్గోహైన్​(ఉదయం 11 గంటలకు)

మహిళల 69 కేజీల విభాగం సెమీఫైనల్​-1లో లవ్లీనా బోర్గోహైన్​.. సుర్మేనేలి బుసానాజ్​తో ఉదయం 11 గంటలకు తలపడనుంది.

హాకీ- సెమీఫైనల్​(మధ్యాహ్నం 3.30 నుంచి)

భారత మహిళల హాకీ జట్టు.. ప్రపంచ నెం.2 అర్జెంటీనాతో సెమీఫైనల్​లో తలపడనుంది.

ఇదీ చూడండి: Tokyo 2020: అవి కలిసొస్తే రెజ్లింగ్‌లో పతకాలు ఖాయం!

Last Updated :Aug 4, 2021, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.