ETV Bharat / sports

స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం

author img

By

Published : Jul 26, 2021, 4:34 PM IST

Updated : Jul 27, 2021, 3:45 PM IST

Chanu
చాను

16:31 July 26

మీరాబాయి చానుకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం

దిల్లీ ఎయిర్​పోర్ట్​లో చాను

టోక్యో ఒలింపిక్స్​ వెయిట్​లిఫ్టింగ్​లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను.. సోమవారం దేశానికి తిరిగివచ్చింది. దిల్లీ ఎయిర్​పోర్టులో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అధికారులు ఆమె కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఆమెకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించారు. 

"టోక్యో ఒలింపిక్స్​కు ముందు అమెరికాలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ, కరోనా మహమ్మారి వల్ల అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ప్రధాని మోదీ నాకు ఈ విషయంలో సాయం చేశారు. యూఎస్ చేరుకోవడానికి కావాల్సిన టికెట్లు ఇచ్చారు. అమెరికాలో శిక్షణకు సంబంధించి వారెంతో మద్దతుగా నిలిచారు. నేను అనుకున్న విధంగా నాకు ట్రైనింగ్ లభించింది. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. టార్గెట్​ ఒలింపిక్​ పోడియం స్కీమ్ కూడా నాకెంతో తోడ్పడింది. నా శక్తి సామర్థ్యాలను వెలికి తీసింది."

-మీరాబాయి చాను, భారత రెజ్లర్​.

"ఈవెంట్​కు ఒక్క రోజు ముందు చాలా టెన్షన్ పడ్డాను. ప్రతి భారతీయుడు మీరాబాయి పతకం గెలవాలని కోరుకుంటాడు. నేను నా కోచ్​ విజయ్​ శర్మ ఐదేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూశాము. నా లక్ష్యం కోసం ప్రతి దాన్ని త్యాగం చేశాము. రియోలో విఫలమైన తర్వాత ఈసారి అలా జరగకూడదని అనుకున్నాను. అందుకే నాపై ఒత్తిడి నెలకొంది. మేము పడిన కష్టానికి నేడు ఫలితం దక్కింది" అని మీరాబాయి పేర్కొంది.

49 కేజీల విభాగంలో బరిలో దిగిన మీరాబాయి మొత్తంగా 202 కేజీలు ఎత్తి సిల్వర్​ మెడల్ గెలుచుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్​లో భారత్​ ఖాతా తెరిచింది.

ఏఎస్పీగా..

టోక్యో ఒలింపిక్స్​లో సిల్వర్​ మెడల్​తో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన చానుకు.. ఇప్పటికే సొంత రాష్ట్రమైన మణిపూర్​ సీఎం బీరేన్ సింగ్ కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించారు. అయితే స్వదేశానికి రాగానే మరో సర్​ప్రైజ్ ఇస్తామని చెప్పారాయన. తాజాగా చానుకు అడిషనల్​ సూపరిండెంట్​ ఆఫ్ పోలీస్​ (ఏఎస్పీ)గా ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించింది మణిపూర్ ప్రభుత్వం.

Last Updated :Jul 27, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.