ETV Bharat / sports

Tokyo Olympcis 2020: మెడల్స్ టేబుల్​లో చైనా మాయ!

author img

By

Published : Aug 12, 2021, 5:06 PM IST

టోక్యో ఒలింపిక్స్​ పతకాల పట్టికను చైనా.. మార్ఫింగ్​ చేసింది! ఈ విషయమై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మెడల్స్ టేబుల్​లో అమెరికా అగ్రస్థానంలో నిలిచినా.. చైనా మీడియా మాత్రం తమ దేశమే నెం.1లో ఉన్నట్లు చూపించడమే ఇందుకు కారణం.

Tokyo Olympcis 2020
చైనా.. అంత పని చేసిందా

జపాన్​ టోక్యో వేదికగా ఒలింపిక్స్(Tokyo Olympics 2020) దిగ్విజయంగా ముగిశాయి. పతకాల పట్టికలో అమెరికానే మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. చివరివరకు చైనా టాప్​లో ఉండగా ఆఖరిరోజు పలు విభాగాల్లో బంగారు పతకాలు గెల్చిన అమెరికా, చైనాను అధిగమించింది.

అయితే.. ఇప్పుడు చైనా మీడియాపై విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. కారణం.. ఒలింపిక్స్​ పతకాల పట్టికలో చైనాను అగ్రస్థానంలో చూపిస్తుండటమే. నెం.1లో అగ్రరాజ్యం ఉంటే.. చైనా ఎలా వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

వాస్తవానికి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్య పతకాలతో అమెరికా మొత్తం 113 మెడల్స్​తో టాప్​లో నిలిచింది. చైనా 88 పతకాలతో (38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం) ద్వితీయ స్థానం సొంతం చేసుకుంది. చైనా మీడియాలో మాత్రం ఆ దేశం 42 స్వర్ణాలు, 37 రజతాలు, 27 కాంస్యాలతో 106 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నట్లు చూపిస్తోంది!

ఇక్కడే చైనా దుర్భుద్ది బయటపడింది. తైవాన్​, మకావు, హాంకాంగ్​ దేశాల పతకాలను కూడా చైనాలో కలుపుకొన్నట్లు తెలుస్తోంది. చైనా సామాజిక మాధ్యమం వీబోలో కూడా అదే చూపిస్తోంది. అయితే.. ఎక్కువ పసిడి పతకాలు సాధించి, పట్టికలో అగ్రభాగాన నిలిచినందుకు చైనా బృందానికి ధన్యవాదాలు అని రాసుండటం గమనార్హం.

టోక్యో ఒలింపిక్స్​ అధికారిక వెబ్​సైట్​ సహా.. ఇతర దేశాల వార్తాఛానెళ్లలో మాత్రం అమెరికానే అగ్రస్థానంలో నిలిచిందని వార్తలు ప్రసారం చేశాయి.

ఇదీ చూడండి: Olympics: పతకాల పట్టికలో మళ్లీ అమెరికానే టాప్​.. భారత్​ ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.