ETV Bharat / sports

Swiss Open: సెమీఫైనల్స్​కు పీవీ సింధు, ప్రణయ్​

author img

By

Published : Mar 25, 2022, 9:45 PM IST

Updated : Mar 25, 2022, 10:32 PM IST

pranoy
pv sindhu

Swiss Open: స్విస్​ ఓపెన్ మహిళ సింగిల్స్​లో​ భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు సెమీఫైనల్​కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్​లో భారత ఆటగాడు హెచ్​ఎస్​ ప్రణయ్​ కూడా సెమీఫైనల్​కు చేరాడు.

Swiss Open: ఒలింపిక్ పతక​ విజేత పీవీ సింధు.. స్విస్​ ఓపెన్​ సెమీఫైనల్స్​కు అర్హత సాధించింది. కెనడా క్రీడాకారిణి మైకేల్​ లీపై 21-10, 21-19 తేడాతో విజయం సాధించింది. సింధు తన తర్వాత మ్యాచ్​లో థాయ్​లాండ్​కు చెందిన సుపనిడా కటెతొంగ్​తో తలపడనుంది.

పురుషుల సింగిల్స్​లో భారత షట్లర్​ హెచ్​ఎస్​ ప్రణయ్​ కూడా సెమీఫైనల్స్​కు చేరాడు. ఇండియాకు చెందిన మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్​పై 21-16, 21-16 తేడాతో గెలిచాడు. సమీర్​ వర్మ, అంథోనీ సిన్సుకా మధ్య జరగబోయే క్వార్టర్​ ఫైనల్​ విజేతతో ప్రణయ్​ తన తదుపరి మ్యాచ్​లో తలపడనున్నాడు.

ఇదీ చదవండి: Swiss Open: స్విస్​ ఓపెన్​ నుంచి సైనా ఔట్​

Last Updated :Mar 25, 2022, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.