ETV Bharat / sports

Sushil Kumar: హత్య కేసులో కొత్త కోణం.. అమ్మాయే కారణమా?

author img

By

Published : Jun 9, 2021, 8:02 PM IST

Updated : Jun 9, 2021, 8:23 PM IST

రెజ్లర్ హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ఇంటి అద్దె విషయంలో వచ్చిన వాగ్వాదాలు హత్యకు కారణం కాదని తెలుస్తోంది. సోను గర్ల్​ఫ్రెండ్​ వల్లే గొడవ మొదలైనట్లు సమాచారం.

sushil kumar, sagar rana
సుశీల్ కుమార్, సాగర్ రానా

భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్​ హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మల్లయోధుడు సాగర్​ రానా హత్యకు అసలు కారణం ఇంటి అద్దె గురించి వచ్చిన ఘర్షణ కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు సాగర్​ స్నేహితుడు సోను గర్ల్​ఫ్రెండ్​ కారణంగానే గొడవ ప్రారంభమైందని విచారణలో స్పష్టమైంది.

అసలు ఏం జరిగింది?

సుశీల్​కు సంబంధించి దిల్లీలోని మోడల్​ టౌన్​ ఫ్లాట్​లో సాగర్​ రానా అద్దెకుండేవాడు. అప్పటికే అద్దె విషయంలో సుశీల్ స్నేహితుడు అజయ్​ పలుమార్లు సాగర్​ను హెచ్చరించాడు. ఫ్లాట్​ ఖాళీ చేయాలని సూచించాడు.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​కు రెజ్లర్​ సుమిత్​​ అర్హత

కానీ, మార్చిలో సోను​ పుట్టినరోజు సందర్భంగా అతడి స్నేహితురాలి సమక్షంలో వేడుకలు చేయలనుకున్నాడు సాగర్​. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక అతిథిగా సోను గర్ల్​ఫ్రెండ్​ను ఆహ్వానించారు. ఇవన్నీ తెలిసి అజయ్ ఆ ఫ్లాట్​ వద్దకు చేరుకుని.. సోను గర్ల్​ఫ్రెండ్​తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాగర్​, సోను.. అజయ్​తో వాగ్వాదానికి దిగారు.

అప్పటికే సుశీల్​, సాగర్ మధ్య వివాదాలు ఉండడం వల్ల.. విషయాన్ని సుశీల్​కు చెప్పాడు అజయ్​. దీంతో వారిద్దరినీ స్టేడియానికి బలవంతంగా తీసుకొచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు సుశీల్ గ్యాంగ్​. ఈ గొడవల్లో తీవ్రంగా గాయపడిన సాగర్​ మే 4న చనిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసులు విచారణలో వెల్లడయ్యాయి. ప్రస్తుతం సుశీల్​తో పాటు అజయ్​ జైలులో ఉన్నారు.

ఇదీ చదవండి: Sushil Kumar: 'మిల్క్​షేక్​, వ్యాయామ పరికరాలు కావాలి!​'

Last Updated : Jun 9, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.