ETV Bharat / sports

ఫార్ములా కారు కంటే వేగం.. ఆ షాట్​తో గిన్నిస్​లోకి సాత్విక్‌..

author img

By

Published : Jul 18, 2023, 3:38 PM IST

Updated : Jul 18, 2023, 4:15 PM IST

Satwiksairaj Reddy Guinness Record : భారత్ స్టార్ షట్లర్​ సాత్విక్‌ సాయిరాజ్.. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000ను గెలుచుకున్నాడు. 22 ఏళ్ల ఈ యంగ్​ ప్లేయర్ బలమైన షాట్​తో అబ్బురపరస్తూ తన పేరిట ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అదేంటంటే..

satvik sairaj reddy guinness record
satvik sairaj reddy

Satwiksairaj Reddy Guinness Record : భారత స్టార్ షట్లర్ సాత్విక్‌ సాయిరాజ్ తాజాగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. 22 ఏళ్ల ఈ యంగ్​ షట్లర్​.. బ్యాడ్మింటన్‌లో అత్యంత వేగంగా షాట్​ కొట్టిన పురుష క్రీడాకారుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గంటకు 565 కిమీ వేగంతో షాట్​ కొట్టి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

తన బ్యాడ్మింటన్​ పార్ట్​నర్ చిరాగ్ శెట్టితో కలిసి ఇటీవల ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000ను గెలుచుకున్న సాత్విక్.. మలేషియాకు చెందిన టాన్ బూన్ హీయోంగ్ 2013లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. మలేషియా ప్లేయర్​ అప్పట్లో గంటకు 493 కిమీ వేగంతో ఆ స్క్వాష్​ కొట్టి చరిత్రకెక్కాడు. సాధారణంగా ఓ రేసింగ్ కార్​ 372.6 km/h గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అయితే సాత్విక్ కొట్టిన స్మాష్ ఫార్ములా 1 కారు టాప్​ స్పీడ్​ కంటే ఎక్కువ ఉండటం విశేషం.

మరోవైపు మలేషియాకు చెందిన టాన్ పెర్లీ 438 కిమీ/గం వేగంతో.. అత్యంత వేగవంతమైన మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్​గా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్​ ఎక్విప్​మెంట్​ తయారీ సంస్థ యోనెక్స్​ ఓ ప్రకటనలో వెల్లడించింది.

"యోనెక్స్ బ్యాడ్మింటన్ అథ్లెట్లు, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, టాన్ పెర్లీ అత్యంత వేగవంతమైన బ్యాడ్మింటన్ హిట్లతో కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారని ప్రకటించడం గర్వంగా ఉంది" అని యోనెక్స్​ తెలిపింది.

ఇండోనేసియా

తాజాగా సాత్విక్‌ సాయిరాజ్‌ -చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఈ యువ ప్లేయర్స్​ ఈ ఘనత సాధించిన తొలి డబుల్స్‌ ప్లేయర్లుగా నయా రికార్డును నెలకొల్పారు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌-1000 టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో 21-17, 21-18తో ఆరోన్‌ చియా-సో వుయిక్‌ (మలేషియా) ద్వయంపై సాత్విక్​ ద్వయం విజయం సాధించింది.

సెమీస్​లో 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్​ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 ఈవెంట్​లో ఫైనల్​కు చేరిన మొద‌టి భార‌త జోడీగా రికార్డు సృష్టించింది. క్వార్టర్స్​లో 21-13, 21-13 తేడాతో టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫియాన్‌- మహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా)పై విజయాన్ని అందుకుంది. మంచి స్మాష్‌లు, డ్రాప్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో విజృంభించిన ఈ ద్వయం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌లో ఈ జోడీ.. స్విస్‌ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలుపొంది గోల్డ్​ మెడల్స్​ను ముద్దాడగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరింది.

Last Updated : Jul 18, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.