ETV Bharat / sports

రైల్వే శాఖ విధుల నుంచి సుశీల్ సస్పెండ్

author img

By

Published : May 25, 2021, 2:07 PM IST

సుశీల్ కుమార్​ను తన బాధ్యతల నుంచి తప్పించింది భారతీయ రైల్వే శాఖ. హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్​ ఇటీవలే అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Sushil kumar
సుశీల్

సుశీల్ కుమార్​ను తన విధుల నుంచి భారతీయ రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఛత్రసాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్​ను ఇటీవలే దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. మరో ప్రకటన చేసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. నార్తర్న్​ రైల్వేలో సీనియర్​ కమర్షియల్​ మేనేజర్​గా పనిచేస్తున్నాడు సుశీల్.

వేచి చూస్తున్నాం..

సుశీల్​ అరెస్టుపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్​(డబ్ల్యూఎఫ్​ఐ) సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ స్పందించారు. ఇది ఘటన క్రీడకు మచ్చలాంటిదని అభిప్రాయపడ్డారు. "ఈ పరిణామం ప్రత్యేకంగా రెజ్లింగ్​కు మంచిది కాదు. దేశంలో రెజ్లింగ్​ అభివృద్ధి కావడానికి అతడు ఎంతో కృషి చేశాడు. అతన్ని ప్రేరణగా తీసుకుని చాలా మంది రెజ్లింగ్​ను కెరీర్​గా ఎంచుకున్నారు. ప్రస్తుతానికి అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది. సుశీల్​ దోషి.. అవునా? కాదా? అనే విషయం తేలాల్సి ఉంది. కాబట్టి అతనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే డబ్ల్యూఎఫ్​ఐ చీఫ్​తో సమావేశమవుతాం" అని వినోద్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.