ETV Bharat / sports

అదరగొట్టిన స్టార్​ షట్లర్ పీవీ సింధు.. టాప్-5లోకి ఎంట్రీ

author img

By

Published : Oct 25, 2022, 6:40 PM IST

స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బ్యాడ్మింటన్​ ర్యాంకింగ్స్​లో అదరగొట్టింది. సింధూతో పాటు డబుల్స్, మిక్స్​డ్ డబుల్స్​ క్యాటగిరీల్లో కూడా భారత షట్లర్లు సత్తా చాటారు.

PV Sindhu  entered into top 5 World Rankings
PV Sindhu entered into top 5 World Rankings

కామన్వెల్త్ పతక విజేత పీసీ సింధు మరో ఘనత సాధించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో మెదటి 5 ర్యాంకుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్​ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మరో పక్క ఏస్ షట్లర్ ప్రణయ్ హెచ్ఎస్ ఒక స్థానం పైకెక్కి ప్రపంచంలో 12వ ర్యాంకులో నిలిచాడు.

ఇక డబుల్స్​ విషయానికొస్తే.. పురుషుల డబుల్స్​లో ఎమ్ఆర్ ఆర్జున్, ధ్రువ్ కపిల రెండు స్థానాలు మెరుగుపరచుకుని 19వ స్థానంలో స్థిరపడ్డారు. మహిళల డబుల్స్​లో త్రీష జాలీ, గాయత్రి గోపీచంద్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని 27వ స్థానంలో నిలిచారు. మిక్స్​డ్ డబుల్స్​లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రాస్టో రెండు స్థానాలు అధిగమించి 29వ స్థానంలో కొనసాగుతున్నారు. ర్యాంకింగ్స్​లో తమ కెరీర్ అత్యున్నత ర్యాంకులు సాధించిన అథ్లెట్లకు ట్విట్టర్​ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది బ్యాడ్మింటన్​ అసోషియేషన్ ఆఫ్​ ఇండియా.

ఇవీ చదవండి : ఆ విషయంలో అనవసరమైన రచ్చ మానేయాలి.. హార్దిక్ పాండ్య హితవు

కోహ్లీ ఎఫెక్ట్​.. దెబ్బకు యూపీఐ లావాదేవీలు ఢమాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.