ETV Bharat / sports

కోహ్లీ ఎఫెక్ట్​.. దెబ్బకు యూపీఐ లావాదేవీలు ఢమాల్​

author img

By

Published : Oct 25, 2022, 12:51 PM IST

kohli innings upi transactions down
కోహ్లీ దెబ్బకు యూపీఐ లావాదేవీలు ఢమాల్​

పాకిస్థాన్​తో జరిగిన​ థ్రిల్లర్ మ్యాచ్‌లో టీమ్ఇండియా సాధించిన ఘన విజయంతో దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. కానీ దేశంలో కొన్ని గంటల పాటు దివాళీ షాపింగ్ మాత్రం నిలిచిపోయింది. యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇందుకు కారణం టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీనే. ఏం జరిగిందంటే..

ప్రస్తుతం సాధారణంగానే యూపీఐ లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి. ఇక పండగ సమయాల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్​లైన్​ షాపింగ్​లు అంటూ మరింత వేగంగా జరుగుతుంటాయి. అయితే ఈ యూపీఐ ట్రాన్స్​క్షసన్స్​​.. టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ కారణంగా ఒక్కసారిగా పడిపోయాయి. ఈ విషయాన్ని మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా సోషల్​మీడియా ద్వారా తెలిపారు.

ఏం జరిగిందంటే.. ఆదివారం భారత్​-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో.. టీమ్​ఇండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. దీంతో భారత క్రికెట్ ప్రేమికులందరికీ ఒకరోజు ముందే దీపావళి పండగ వచ్చేసింది. బాంబులు కాలుస్తూ సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే సాధారణంగా పండగ అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆన్​లైన్​ షాపింగ్ అమ్మకాలు కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇక పండగ ముందు రోజు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీఐ ట్రాన్స్​క్షసన్స్​​ లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి. కానీ ఈ సారి దీపావళి ముందు రోజు అలా జరగలేదు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడం అందులోనూ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేయడం వల్ల అందరూ ఫోన్లకు టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ఉదయం 9 నుంచి మ్యాచ్ ప్రారంభ సమయం మధ్యాహ్నం 1:30 గంటల వరకు బాగానే సాగిన ట్రాన్స్​క్షసన్స్​ ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యాక తగ్గుముఖం పట్టాయి. మరీ ముఖ్యంగా చివర్లో విరాట్ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించే దిశగా తీసుకెళ్తున్నప్పుడు, యూపీఐ లావాదేవీలు ఢమాల్​ అయినట్లు మిహిర్ వోరా ట్వీట్​లో పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లీ వల్లే దేశవ్యాప్తంగా షాపింగ్ ఆగిపోయిందనే క్యాప్షన్ కూడా పెట్టారు.

రికార్డ్​ వ్యూయర్​షిప్​.. సాధారణంగానే.. భారత్, పాకిస్థాన్​ మ్యాచ్ అన్నప్పుడు భారతీయ క్రీడాభిమానులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అలాంటిది.. నిన్న నరాలు తెగే థ్రిల్లింగ్​ మ్యాచ్ కొనసాగడం, కోహ్లీ విజృంభించడంతో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపించారు. డిస్నీ+ హాట్‌స్టార్ చరిత్రలో ఎన్నడూ లేనంత 1.80 కోట్ల మంది వీక్షించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్​లో ఇదే అత్యధిక వ్యూయర్​షిప్ కావడం విశేషం​.

ఇదీ చూడండి: భారత్​-పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ రికార్డ్​.. ఇదే తొలిసారి

T20 Worldcup: భారత్​-పాక్ మళ్లీ ఎప్పుడు తలపడనున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.