ETV Bharat / sports

శ్రీకాంత్​పై మోదీ ప్రశంసలు.. ప్రధానికి లక్ష్యసేన్ తియ్యటి కానుక​!

author img

By

Published : May 22, 2022, 11:40 AM IST

Updated : May 22, 2022, 12:38 PM IST

kidambi srikanth thomas cup
kidambi srikanth thomas cup

kidambi srikanth thomas cup: భారత స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. థామస్, ఉబెర్​ కప్​లు గెలిచిన క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరో షట్లర్​ లక్ష్యసేన్​ ప్రధానికి మిఠాయిలు కానుకగా ఇచ్చారు.

kidambi srikanth thomas cup: ప్రతిష్టాత్మక థామస్​ కప్​ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మరో స్టార్ షట్లర్​ లక్ష్యసేన్​ ప్రధాని మోదీకి 'అల్మోరా బాల్​ మిఠాయి'ని కానుకగా ఇచ్చాడు. థామస్, ఉబెర్​ కప్​లు గెలిచిన క్రీడాకారులతో మోదీ స్వయంగా మాట్లాడి, శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల తర్వాత థామస్​ కప్​ గెలిపించి.. దేశానికి గర్వకారణంగా నిలిచారని క్రీడాకారులను అభినందించారు. ఇలాంటి పెద్ద టోర్నమెంట్​లో ఫైనల్​కు చేరడం సులభం కాదని.. ఈ సందర్భంగా జట్టుకు నేతృత్వం వహించిన శ్రీకాంత్​ను అభినందించారు మోదీ.

దేశ ప్రధాని మా వెనుక ఉన్నారని.. క్రీడాకారులందరం గర్వంగా చెపుతాం. మ్యాచ్​ గెలిచిన అనంతరం మోదీ మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది. మేము మరింత బాగా రాణించేలా ఇది ప్రొత్సహిస్తోంది. భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం.

-కిదాంబి శ్రీకాంత్, షట్లర్​

Thomos cup 2022 winner
ప్రధానికి మిఠాయి కానుకగా ఇస్తున్న లక్ష్యసేన్​

ప్రధానికి లక్ష్యసేన్​ తియ్యటి కానుక: తనకు అల్మోరా బాల్​మిఠాయి తెచ్చినందుకు లక్ష్యసేన్​కు ధన్యావాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తన చిన్న కోరికను గుర్తుంచుకొని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. థామస్​ కప్​ గెలిచిన అనంతరం క్రీడాకారులతో మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్యసేన్​తో మాట్లాడిన మోదీ.. తనకు స్వీట్​ కావాలని కోరారు.

Thomos cup 2022 winner
క్రీడాకారులతో మాట్లాడుతున్న ప్రధాని
Thomos cup 2022 winner
క్రీడాకారులు

నేను తొలిసారిగా యూత్​ ఒలింపిక్స్ గెలిచినపుడు మోదీని కలిశా. మళ్లీ ఈరోజు కలిసే అవకాశం వచ్చింది. ఆయనను ఎప్పుడు కలిసినా సరే మాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మోదీని కలిసి బాల్​మిఠాయి ఇవ్వడానికి.. మరిన్ని టోర్నమెంట్​లు గెలుస్తా. అల్మోరా మిఠాయికి ప్రసిద్ధి అని.. మా నాన్న, తాతయ్య క్రీడాకారులు అని గుర్తుచేశారు. అంత పెద్ద హోదాలో ఉండి ప్రతి చిన్న విషయాలను గుర్తుచేయడం అరుదైన విషయం.

-లక్ష్యసేన్​, షట్లర్​

Thomos cup 2022 winner: మే 15న జరిగిన ఫైనల్​లో థామస్​ కప్ గెలిచి.. 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చరిత్ర సృష్టించింది భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు. గత 70 ఏళ్ల చరిత్రలో భారత్​ ఒక్కసారి కూడా ఫైనల్​కు చేరలేకపోయింది. 1952, 1955, 1979లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్​కు చేరుకుంది.

ఇదీ చదవండి: Thaliand Open: సెమీస్​లో సింధు ఓటమి.. టోర్నీ నుంచి ఔట్

Last Updated :May 22, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.