ETV Bharat / sports

ఆ పొరపాటు వల్లే ఈ ఆరోపణలు: టెన్నిస్ ప్లేయర్ పెంగ్

author img

By

Published : Feb 7, 2022, 1:15 PM IST

Peng Shuai
Peng Shuai

Peng Shuai: తనపై ఓ ఉన్నతాధికారి లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించింది చైనీస్ స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ పెంగ్​ షువాయి. గతంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఆరోపణలు తలెత్తాయని స్పష్టం చేసింది.

Peng Shuai: చైనా ఉన్నతాధికారి ఒకరు.. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి మరోసారి ఖండించింది. గతంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకోవడం వల్లే ఈ ఆరోపణలు తలెత్తాయని ఫ్రెంచ్​ పత్రిక ముఖాముఖీలో స్పష్టం చేసింది. చైనా ఒలింపిక్‌ కమిటీ ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించింది.

చైనాలో వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభమైన గత శనివారం.. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు థామస్‌ బాచ్​ పెంగ్‌ షువాయితో మాట్లాడారని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. గత నవంబరులో సామాజిక మాధ్యమాల్లో పెంగ్‌ పెట్టిన పోస్టుపై ఆరా తీశారని తెలిపింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ నేత తనపై లైంగిక దాడికి యత్నించారని అప్పట్లో ఆమె పెట్టిన పోస్టు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పెంగ్‌ కొన్నిరోజుల పాటు అదృశ్యమైంది. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కనిపించిన చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి తాజా ఇంటర్వ్యూలో లైంగిక దాడి ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు సమగ్ర దర్యాప్తు జరపకుండా పెంగ్‌ చేసిన ఆరోపణలపై ఒక అభిప్రాయానికి రాలేమని ఐఓసీ పేర్కొంది.

ఇదీ చూడండి: క్రికెట్​ ఫ్యాన్స్​కు శుభవార్త​.. అమ్మకానికి టీ20 ప్రపంచకప్​ టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.