ETV Bharat / sports

నిఖత్​కు​ బెర్త్​ కన్ఫామ్​.. కామన్​వెల్త్​ పోటీల్లోకి తెలుగు తేజం

author img

By

Published : Jun 11, 2022, 5:57 PM IST

d
d

ఇటీవల ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సత్తా చాటిన యువబాక్సర్​ నిఖత్​ జరీన్​ కామన్​వెల్త్​ క్రీడల్లో పోటీ చేసేందుకు బెర్త్​ కన్ఫామ్​ చేసుకుంది. ఒలింపిక్స్​ కాంస్యపతక విజేత లవ్లీనాకు కూడా టోర్నీలో బరిలో దిగేందుకు లైన్​ క్లియరైంది. భారత్​ తరఫున మొత్తం నలుగురు మహిళా బాక్సర్లు కామన్​వెల్త్​ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.

ప్రపంచ ఛాంపియన్​షిప్ విజేత, ​స్టార్​ మహిళా బాక్సర్​ నిఖత్​ జరీన్​ కామన్​వెల్త్​ క్రీడల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సెలక్షన్​ ట్రయల్స్​లో హరియాణాకు చెందిన మీనాక్షిపై 7-0 తేడాతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది నిఖత్. దీంతో ఆమెకు కామన్​వెల్త్​లో 50కేజీల కేటగిరీలో పోటీ చేసేందుకు బెర్త్​ కన్ఫామ్​ అయింది. మరోవైపు ఒలిపింక్స్​ కాంస్య పతక విజేత లవ్లీనాకు కూడా కామన్​వెల్త్​లో పోటీ చేసేందుకు లైన్​ క్లియరైంది. ఆమె 70 కిలోల కేటగిరీలో బరిలోకి దిగనుంది. వీరితో పాటు నీతు గంఘస్​ (48 కేజీ), జాస్మిన్​ లంబోరియా (60 కేజీ) కూడా భారత్​ తరఫున మహిళా బాక్సర్ల బృందంలో ఉన్నారు.

"ప్రపంచ ఛాంపియన్​షిప్​ పోటీల తర్వాత నేను ట్రెయినింగ్​కు దూరంగా ఉన్నాను. దీంతో మళ్లీ బౌట్​లో నిలదొక్కుకోవడం కాస్త ఇబ్బంది అనిపించింది. అయినా ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిపై విజయం సాధించగలిగాను. ఈ ప్రదర్శన నా సామర్థ్యంలో 50 శాతం కూడా ఉండదు."

-నిఖత్​ జరీన్, బాక్సర్

మేరీకామ్​ ఔట్​..: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన స్టార్​ బాక్సర్​ మేరీకామ్​ ఈ కామన్​వెల్త్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించి మరోసారి సత్తాచాటుదామనుకున్నారు. కానీ ఆమెకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన బాక్సింగ్​ ట్రయల్స్​లో ఆమె మోకాలికి గాయమైంది. దీంతో మేరీకామ్​ ఈ కామన్​వెల్త్​ క్రీడలకు దూరమయ్యారు. బర్మింగ్​హమ్​ వేదికగా ఈనెల 18 నుంచి 22 వరకు కామన్​వెల్త్​ క్రీడలు జరగనున్నాయి.

ఇదీ చూడండి : 'చాలా కష్టపడ్డా.. పెద్ద యుద్ధమే చేశా.. ఇప్పుడు నేను హ్యాపీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.