ETV Bharat / sports

డిజిటల్ వేదికగా అవార్డులు అందుకున్న క్రీడాకారులు

author img

By

Published : Aug 29, 2020, 1:02 PM IST

Updated : Aug 29, 2020, 1:19 PM IST

నేడు (ఆగస్టు 29) హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. అత్యున్నత క్రీడా పురస్కారాలను ఆటగాళ్లకు అందించారు. వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్టపతి రామ్​నాథ్ కోవింద్​ పాల్గొని క్రీడాకారులకు అవార్డులు అందజేశారు.

డిజిటల్ వేదికగా అవార్దులు అందుకున్న క్రీడాకారులు
డిజిటల్ వేదికగా అవార్దులు అందుకున్న క్రీడాకారులు

కరోనా కారణంగా ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల వేడుక వర్చువల్​గా జరిగింది. హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొని అవార్డులు అందజేశారు. అత్యున్నత పురస్కారం ఖేల్​రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్​చంద్ అవార్డుల్ని క్రీడాకారులు అందుకున్నారు.

మొత్తం ఈ ఏడాది అవార్డుల కోసం 74 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఇందులో 14 మంది అథ్లెట్లు వివిధ కారణాలతో వేడుకకు హాజరుకాలేకపోయారు. మిగిలిన 60 మంది ఈరోజు అవార్డుల్ని అందుకున్నారు.

ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకను రాష్ట్రపతి భవన్​లో నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల జరిగిన వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమానికి జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కార్యాలయాలు వేదికయ్యాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చండీగఢ్‌, బెంగళూరు, పుణె, సోనెపట్‌, హైదరాబాద్‌, భోపాల్‌లోని సాయ్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.​ రాష్ట్రపతి భవన్​ నుంచి రామ్​నాథ్​ కోవింద్ లైవ్​లో పాల్గొన్నారు.

అవార్డులు అందుకున్న క్రీడాకారులు
అవార్డులు అందుకున్న క్రీడాకారులు

పెరిగిన నగదు బహుమతి

క్రీడల, సాహస పురస్కారాాల నగదు బహుమతిని పెంచింది క్రీడామంత్రిత్వ శాఖ. అర్జున అవార్డుకు 15లక్షలు, ఖేల్​రత్నకు 25 లక్షలు అందజేయనున్నారు. ఇంతకుముందు ఈ నగదు విలువ వరుసగా 5, 7.5 లక్షలుగా ఉండేది. క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.

Last Updated : Aug 29, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.