ETV Bharat / sports

Fifa worldcup: బ్రెజిల్​, నెదర్లాండ్స్​​కు షాక్​.. సెమీస్​​కు దూసుకెళ్లిన క్రొయేషియా-అర్జెంటీనా

author img

By

Published : Dec 10, 2022, 9:52 AM IST

Updated : Dec 10, 2022, 3:56 PM IST

Fifa worldcup 2022
బ్రెజిల్​, నెదర్లాండ్స్​​కు షాక్​.. సెమీక్​కు దూసుకెళ్లిన క్రొయేషియా-అర్జెంటీనా

ఫిఫా వరల్డ్​ కప్​ 2022లో మరో రెండు జట్లు సెమీస్​కు దూసుకెళ్లాయి. అర్జెంటీనా, క్రొయేషియా సెమీఫైనల్​కు అర్హత సాధించాయి.

ఫిఫా వరల్డ్​ కప్​ 2022 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న జట్లు పెద్ద జట్లు మధ్య హోరాహోరీగా మ్యాచ్​లు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా నెదర్లాండ్స్​ జట్టును ఓడించి సెమీఫైనల్​కు దూసుకెళ్లింది అర్జెంటీనా. పెనాల్టీ షూట్​ఔట్​ ద్వారా 4-3తేడాతో విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. మెస్సీ అసాధార‌ణ ఆట‌తీరును ప్రదర్శించాడు. మ్యాచ్‌ ఫస్ట్‌హాప్‌లో అద్భుతమైన కిక్‌తో మెస్సీ తొలి గోల్‌ను తన జట్టుకు అందించాడు.

దీంతో తొలి అర్ధబాగం ముగిసే సరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెకెండ్‌ హాఫ్‌లో మెస్సీ అసిస్ట్ సహాయంతో మరో గోల్‌ను సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకెండ్‌ హాఫ్‌లో ఆనూహ్యంగా పుంజుకున్న నెద‌ర్లాండ్స్ రెండు గోల్స్ చేసి స్కోరును స‌మం చేసింది. దీంతో మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయం కెటాయించాడు. అయితే అదనపు సమయంలో ఇరు జట్లు గోల్‌ను సాధించలేకపోయాయి. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్‌ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఇక పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా పెనాల్టీ షూటౌట్‌లోనూ మెస్సీ అద్భుతమైన గోల్‌ సాధించాడు. ఇక డిసెంబర్‌ 14న క్రోయేషియాతో సెమీఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది.

బ్రెజిల్​కు షాక్​.. అంతుకముందు గత రాత్రి శుక్రవారం ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జట్టుకు షాకిచ్చింది క్రొయేషియా. పెనాల్టీ షూటౌట్లో 4-2తో షాకిచ్చి సెమీస్​కు దూసుకెళ్లింది. మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్స్‌ కొట్టలేకపోగా.. అదనపు సమయంలో తలో గోల్‌ సాధించాయి. బంతిపై ఇరు జట్లూ సమానంగా నియంత్రణ సాధించినా.. మ్యాచ్‌లో గోల్‌ లక్ష్యంగా ఎక్కువ షాట్లు ఆడింది బ్రెజిలే. నెయ్‌మార్‌ సహా బ్రెజిల్‌ ఆటగాళ్లు పలుమార్లు బంతిని నెట్‌లోకి పంపేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే క్రొయేషియా డిఫెన్స్‌ చాలా బలంగా నిలబడి బ్రెజిల్‌కు చెక్‌ పెట్టింది. ఆ జట్టు గోల్‌ కీపర్‌ లివకోవిచ్‌ నిర్ణీత సమయంలోనే కాక.. పెనాల్టీ షూటౌట్లోనూ అదరగొట్టి మ్యాచ్‌ హీరోగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో వ్లాసిచ్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను ఆధిక్యంలో నిలపగా.. రోడ్రిగో విఫలమవడం బ్రెజిల్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రోడ్రిగో నెట్‌ కొట్టిన షాట్‌ను సరిగ్గా అంచనా వేసిన లివకోవిచ్‌ అద్భుత డైవ్‌తో ఆపేశాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఇరు జట్లూ విజయవంతమయ్యాయి. నాలుగో ప్రయత్నంలో ఓర్సిచ్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను 4-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. మార్కినో కొట్టిన షాట్‌ ఎడమవైపు గోల్‌ బార్‌ను తాకి బయటికి వచ్చేయడంతో బ్రెజిల్‌ కథ ముగిసింది.

ఇదీ చూడండి: తేలిపోయిన టీమ్​ఇండియా బౌలర్లు.. తొలి టీ20లో ఆసీస్‌ ఘన విజయం

Last Updated :Dec 10, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.