ETV Bharat / sports

యువ ప్లేయర్ల కోసం మేరీకోమ్​ త్యాగం

author img

By

Published : Mar 7, 2022, 9:36 AM IST

Updated : Mar 7, 2022, 10:12 AM IST

Boxer MC Mary Kom: భారత దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్ ప్రపంచ ఛాంపియన్​షిప్స్, ఆసియన్​ గేమ్స్​ నుంచి తప్పుకుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన దృష్టంతా కామన్వెల్త్​ గేమ్స్ మీద ఉన్నట్లు చెప్పింది.

mary kom
మేరీకోమ్​

Boxer MC Mary Kom: భారత స్టార్​ బాక్సర్​ మేరీకోమ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్స్​​, ఆసియన్​ గేమ్స్​ నుంచి తప్పుకుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బాక్సింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా. కాగా, ఆరు సార్లు ప్రపంచఛాంపియన్​ అయిన ఆమె కామన్వెల్త్​ గేమ్స్​ కోసం సన్నద్ధమవుతోంది. ఐబీఎ ఎలైట్​ ఉమెన్స్​ వరల్డ్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​, 2022 ఆసియన్​ గేమ్స్​ మార్చి 7(నేడు) ప్రారంభం కానున్నాయి.

"ఈ టోర్నీల నుంచి తప్పుకొని యువ ఆటగాళ్లకు అవకాశం ఇద్దామనుకుంటున్నాను. ఇలాంటి పెద్ద టోర్నమెంట్​లలో ఆడితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తు తెచ్చుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది. నేను కామన్వెల్త్​ గేమ్స్​ కోసం శిక్షణ చేస్తున్నాను"

-మేరీకోమ్​.

"మేరీకోమ్​.. భారత బాక్సింగ్​కు రెండు దశాబ్దాలుగా టార్చ్​బేరర్​గా నిలిచారు. బాక్సర్లకు మాత్రమే కాకుండా ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం." అని అన్నారు బాక్సింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా అధ్యక్షుడు అజయ్​ సింగ్​.

ఇదీ చూడండి: ఈ సర్ఫింగ్​ భామ.. యమ హాట్​ గురూ!

Last Updated : Mar 7, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.