ETV Bharat / sports

'ఒలింపిక్​ దినోత్సవాన్ని జరుపుకోవాలి'

author img

By

Published : Jun 22, 2020, 3:21 PM IST

Updated : Jun 22, 2020, 3:36 PM IST

దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా ఒలింపిక్​ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని పిలుపునిచ్చారు భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడు నరీందర్​ బత్రా. ఈ సమయంలో కరోనా జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

narendar batra
నరీందర్​ బత్రా

ఏటా జూన్‌ 23న ఒలింపిక్‌ దినోత్సవ పరుగు నిర్వహించడం ఆనవాయితీ. విశ్వక్రీడల ప్రాముఖ్యతను చాటి చెప్పి, దేశాల మధ్య స్నేహ సంబంధాలను మెరుగు పరచడానికి దీనిని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుక నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ప్రతిఒక్కరు ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడు నరీందర్​ బత్రా. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం, మాస్క్​ ధరించడం వంటి జాగ్రత్త చర్యలు తప్పనిసరి పాటించాలని విజ్ఞప్తి చేశారు.

భారత్.. క్రీడలను చూస్తూ ఆస్వాదించే స్థాయి నుంచి స్వయంగా పతకాలు గెలుపొంది.. దేశప్రజలు గర్వించదగ్గ స్థాయికి ఎదిగిందని వెల్లడించారు బత్రా. ఈ ఘనత మన క్రీడాకారుల నిరంతర కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. అలాంటి క్రీడాకారులను ఒలింపిక్​ దినోత్సవం రోజున స్మరించుకోవడమే మనం వారికిచ్చే గౌరవమని అన్నారు. వైరస్​ జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఆడటానికి సాధ్యమయ్యే క్రీడలను నిర్వహించాలని సూచించారు.

"భౌతిక దూరం పాటిస్తూ ఆడటానికి సాధ్యమయ్యే క్రీడలను నిర్వహించాలి. ముఖ్యంగా ఒలింపిక్​ క్రీడాకారులు ఈ వేడుకను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని ఈ ఒలింపిక్​ దినోత్సవాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నా."

-నరీందర్​ బత్రా.

ఇటీవల నరీందర్​ బత్రా ఇంట్లో దాదాపు ఎనిమిది మందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్​లో ఉన్నారు.

narendar batra
నరీందర్​ బత్రా

ఇది చూడండి : ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా

Last Updated : Jun 22, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.