ETV Bharat / sports

ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా

author img

By

Published : Jun 12, 2020, 11:08 AM IST

ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో ఎనిమిదో వ్యక్తి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన ఇంట్లోని మిగతా సభ్యులు, ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్నారు.

ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో 8 మందికి కరోనా
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్​ బత్రా

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే నెగిటివ్​ వచ్చిన వారికి వచ్చే వారం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

నరీందర్ బత్రా ఇంటిలో తొలుత ఆయన తండ్రికి కరోనా సోకింది. ఆ తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, అటెండర్​ ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగతా కుటుంబసభ్యులు జూన్ 26 వరకు హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు.

Narinder Batra
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్​ బత్రా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.