ETV Bharat / sports

ప్రధాని మోదీ ఇచ్చిన ప్రేరణతోనే రెజ్లింగ్​లో పతకం గెలిచా

author img

By

Published : Aug 14, 2022, 12:48 PM IST

vinesh phoghat
vinesh phoghat

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత రెజ్లింగ్​ను వదిలేద్దామనుకున్నానని రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ చెప్పింది. ఆ సమయంలో ప్రధాని మోదీ మాటలు తనను ఉత్తేజపరిచాయని తెలిపింది. అయితే ఇటీవల జరిగిన కామెన్వెల్త్​ క్రీడల్లో వినేశ్ స్వర్ణ పతకాన్ని సాధించింది.

Vinesh Phoghat: టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవడంలో విఫలమయ్యాక రెజ్లింగ్‌ను వదిలేయాలనుకున్నానని కామన్వెల్త్ బంగారు పతక విజేత వినేశ్‌ ఫొగాట్‌ చెప్పింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాటలు తనను ఉత్తేజపరిచాయని తెలిపింది. క్వార్టర్‌ఫైనల్లో గాయంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పతకానికి దూరమైన వినేశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లోనే ఓడింది. తన బరువు విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా బరిలోకి దిగినా.. ఆమె పరాజయంపాలైంది. అయితే ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది.

"ఇప్పుడు నేను సరికొత్త వినేశ్‌ని. పెద్ద మానసిక అడ్డంకిని అధిగమించా. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గకపోవడం వల్ల రెజ్లింగ్‌ను వదిలేద్దామనుకున్నా. అయితే అథ్లెట్లందరికీ ఒలింపిక్స్​ అతి పెద్ద వేదిక. నేను నిరాశలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీని కలిశా. ఆయన మాటలతో ప్రేరణ పొందాను. 'నీపై మాకు నమ్మకముంది. నువ్వు సాధించగలవు' అని ప్రధాని అన్నారు. ఆ మాటలు నాకు ఉత్తేజాన్నిచ్చాయి" అని వినేశ్‌ చెప్పింది.

"చిన్నప్పటి నుంచి నాకు క్రీడలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నేను మనసు పెట్టి ఆడతాను. అయితే గెలిచిన తర్వాత అందరూ మన వెనుక ఉంటారు. కానీ ఓడిపోయిన తర్వాత మద్దతు లభించినప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. టోక్యో ఒలింపిక్స్​ తర్వాత నా కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు నాకు అండగా నిలిచారు. వారందరికీ నేను రుణపడి ఉంటాను" అంటూ వినేశ్​ ఫొగాట్​ చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ వేసుకోని జకోవిచ్ యూఎస్​ ఓపెన్​లో​ ఆడనున్నాడా

భవిష్యత్​లో టెస్టు క్రికెట్‌ ఆడేవాళ్లు అసలు ఉంటారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.