ETV Bharat / sports

కామన్వెల్త్​లో మిస్సింగ్ కలకలం.. మొన్న 10 మంది.. ఇప్పుడు మరో ఇద్దరు

author img

By

Published : Aug 11, 2022, 12:25 PM IST

Updated : Aug 11, 2022, 12:31 PM IST

two boxers missing
ఇద్దరు బాక్సర్లు మిస్సింగ్​

ఇప్పటికే కామన్వెల్త్​ గేమ్స్​లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా.. తాజాగా పాకిస్థాన్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు కూడా మిస్​ అయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్​ ఘనంగా ముగిశాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక బృందంలోని 10 మంది సభ్యులు అదృశ్యమైన సంఘటన మరవకముందే.. ఇప్పుడు మరో ఇద్దరు ప్లేయర్స్​ కూడా మిస్​ అయ్యారని తెలిసింది. కామన్వెల్త్​లో పాల్గొన్న పాకిస్థాన్​కు చెందిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లాఖాన్ తిరిగి ప్రయాణమయ్యే సమయంలో అదృశ్యమయ్యారని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్‌ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు.

ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు కేవలం రెండు గంటల ముందుగానే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు వారిద్దరు చివరిసారిగా ఎవరితో మాట్లాడారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం హంగేరీలో ఫినా వరల్డ్ ఛాంపియన్ షిప్​లో కూడా పాల్గొనాల్సిన పాకిస్థాన్​కు చెందిన స్విమ్మర్ ఫైజాన్ అక్బర్ మిస్సయ్యాడు. అతడి ఆచూకి ఇప్పటి వరకు దొరకలేదు.

ఇదీ చూడండి: ఆ హీరోయిన్​ను చూస్తే జాలేస్తుంది.. ఫేమ్ కోసం మరీ ఇంతలా.. పంత్ ఆవేదన!

Last Updated :Aug 11, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.