ETV Bharat / sports

సాత్విక్, చిరాగ్ జోడీకి నిరాశ, ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యంతో సరి

author img

By

Published : Aug 27, 2022, 10:50 AM IST

Updated : Aug 27, 2022, 11:42 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్​లో భారత్‌ నెంబర్​ వన్​ జోడీ సాత్విక్‌ సాయిరాజు చిరాగ్‌శెట్టి ఓటమి ఎదురైంది. ఫలితంగా ఈ జోడీ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Badminton World Championships
సాత్విక్, చిరాగ్ జోడీకి నిరాశ

Badminton World Championships satwik sairaj chirag shetty టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో భారత్‌ పోరాటం ముగిసింది. సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్లో మలేసియా జోడీ వూయ్‌ యిక్‌- ఆరోన్‌ చియా చేతిలో 20-22, 21-18, 21-16 తేడాతో పరాజయం పాలయ్యారు.77 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ సెమీస్‌ పోరులో.. 22-20తో తొలి గేమ్‌ నెగ్గిన సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ ఆ తర్వాత 18-26, 16-21తో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయింది. దీంతో కాంస్య పతకంతో టోర్నీని ముగించింది. కాగా.. మలేసియా ద్వయం చేతిలో సాత్విక్‌ - చిరాగ్ జోడీకి వరుసగా ఇది ఆరో ఓటమి.

అయితే సెమీస్‌లో ఓటమిపాలైనప్పటికీ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో భారత్‌కు పతకం దక్కింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ డబుల్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. పురుషుల విభాగంలో మొదటిది. అంతకుముందు 2011లో మహిళల డబుల్స్‌ విభాగంలో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్యం
ఇదీ చూడండి: పాక్​ పేసర్​తో కింగ్ కోహ్లీ చిట్​చాట్​, ఫామ్​లోకి రావాలంటూ ఆకాంక్షించిన బౌలర్​​

Last Updated : Aug 27, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.