ETV Bharat / sports

నీరజ్ స్వర్ణం అందుకున్న రోజు.. ఇకపై ప్రతి ఏటా

author img

By

Published : Aug 10, 2021, 4:40 PM IST

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ తన తదుపరి లక్ష్యమని ​ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్​ చోప్డా స్పష్టం చేశాడు. నీరజ్​ చోప్డా స్వర్ణం గెలిచిన ఆగస్టు 7న, ప్రతి ఏడాది జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తామని ఏఎఫ్ఐ తీర్మానించింది.

Neeraj Chopra
నీరజ్​ చోప్డా

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్డా తెరదించాడు. అలానే సరికొత్త అధ్యయాన్ని లిఖించాడు. వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ తన తదుపరి లక్ష్యం అని ఇతడు స్పష్టం చేశాడు. అథ్లెటిక్స్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా(ఏఎఫ్​ఐ) సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

తదుపరి లక్ష్యం అదే..

'నేను ఇప్పటికే ఆసియా గేమ్స్​లో స్వర్ణం సాధించాను. వచ్చే ఏడాది ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించటమే నా తదుపరి లక్ష్యం. అయితే ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఒక్కోసారి ఒలింపిక్స్​ కంటే కష్టంగా ఉంటుంది. ఏషియన్ గేమ్స్, కామన్​ వెల్త్​ గేమ్స్, ఒలింపిక్స్​లో మరోసారి స్వర్ణం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తాను' అని నీరజ్ చెప్పాడు.

2015లో కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో తనకు ఐదోస్థానం దక్కినా.. ఏఎఫ్ఐ తనను నేషనల్ క్యాంప్​లో శిక్షణ కోసం ఎంపిక చేసిందని, అప్పటి నుంచే తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకొచ్చాడు నీరజ్​.

ప్రతి ఏటా ఆ రోజున పోటీలు..

ఆగస్టు 7.. ఒలింపిక్స్ అథ్లెటిక్స్​లో భారత్​ 100 ఏళ్ల కలను సాకారం చేసిన రోజు. ఎందుకంటే.. ఆ రోజే టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్ చోప్డా స్వర్ణం సాధించింది. అయితే నీరజ్ చోప్డా గౌరవార్ధం.. ప్రతి ఏటా ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహించాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా(ఏఎఫ్​ఐ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏఎఫ్ఐ ఛైర్మన్ లలిత్ బానోత్ తెలిపారు.

"జావెలిన్ త్రో క్రీడను మరింత ప్రోత్సహించాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా(ఏఎఫ్​ఐ) ప్రణాళిక కమిటీ నిర్ణయించింది. ప్రతి ఏటా ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జావెలిన్ పోటీలు నిర్వహించాలని తీర్మానించింది" అని లలిత్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ఒలింపిక్ పతక​ విజేతలకు అదిరిపోయే సన్మానం

Neeraj Chopra: నీరజ్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

విశ్వక్రీడల్లో మనం.. దేశానికి రావాలి మరెన్నో పతకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.