ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్​ కోసం ఇరుకు గదుల్లోనే బస!

author img

By

Published : Jul 17, 2021, 5:31 PM IST

ఈ ఒలింపిక్స్​కు 100కు పైగా అథ్లెట్లు మన దేశం తరఫున బరిలో దిగుతున్నారు. మరి పూర్తి స్థాయిలో తొలిసారి భారత్​ ఒలింపిక్స్​లో ఎప్పుడు ఆడింది?

1920 olympics interesting facts
1920 ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​ కోసం 119 మందితో బృందాన్ని పంపిస్తోంది భారత ఒలింపిక్ సంఘం. అయితే తొలిసారి మన దేశ జట్టు ఏ ఒలింపిక్స్​లో పాల్గొందో తెలుసా? ఒలింపిక్స్ జెండాను తొలిసారిగా ఎప్పుడు పరిచయం చేసిందో తెలుసా?

1920 అంట్వెర్ప్ ఒలింపిక్స్

  • 1916లో బెర్లిన్​లో ఒలింపిక్స్​ జరగాలి. కానీ మొదటి ప్రపంచ యుద్ధం(World War I) కారణంగా అవి రద్దయ్యాయి. అనంతరం 1920లో బెల్జియంలోని అంట్వెర్ప్ వేదికగా మెగాక్రీడల్ని నిర్వహించారు.
  • తొలి వరల్డ్ వార్​లో ఓటమిపాలైన జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, బల్గేరియా, టర్కీ దేశాలకు ఈ ఒలింపిక్స్​కు ఆహ్వానం అందలేదు. కొత్తగా ఏర్పాటైన సోవియట్ యూనియన్.. వారు పాల్గొనకూడదని భావించడమే ఇందుకు కారణం!
  • ఇబ్బందికర వాతావరణం, ఆర్థిక ఒడుదొడుకులు కారణంగా ఈ ఒలింపిక్స్​కు ఆతిథ్యమిచ్చిన అంట్వెర్ప్ కష్టాలు ఎదుర్కొంది. అసంపూర్తిగా నిర్మించిన స్టేడియంలోనే పోటీలు నిర్వహించారు. అథ్లెట్లు.. మడత మంచాలపై, ఇరుకుగదుల్లో సర్దుకుని ఆటల్లో పాల్గొన్నారు.
  • ప్రస్తుతం కనిపించే ఐదు రింగుల ఒలింపిక్​ జెండాను తొలిసారి 1920 మెగాక్రీడల్లోనే పరిచయం చేశారు.
  • ఓ అథ్లెట్​తో ఒలింపిక్ ప్రమాణం చేయించింది.. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేసింది ఈ ఒలింపిక్స్​లోనే కావడం విశేషం.
  • ఒలింపిక్స్​ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరైన నేడో నాడీ(ఇటలీ).. ఫెన్సింగ్​లో ఆరు ఈవెంట్లలో పాల్గొని ఐదు గోల్డ్(స్వర్ణం) మెడల్స్ సొంతం చేసుకున్నాడు.
  • 1920 ఒలింపిక్స్​లోనే తొలిసారి భారత్​, పూర్తి స్థాయి బృందంతో పాల్గొంది. అంతకు 20 ఏళ్ల ముందు పారిస్​లో జరిగిన పోటీల్లో నార్మన్​ పిచర్డ్ ఒంటరిగా బరిలో దిగారు.
    .
    .
  • మన బృందంలోని పూర్మ బెనర్జీ(100 మీ, 400 మీ), పదెప్ప చౌగలే(1000 మీ, మారథాన్), సదాశివ్ డాటర్(మారథాన్)తో పాటు ఇద్దరు రెజ్లర్లు కుమార్ నవాలే, రణ్​ధీర్​ ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.