ETV Bharat / sports

ర్యాంకింగ్స్: పురుషులు 4..  మహిళలు 9

author img

By

Published : Dec 21, 2020, 9:17 PM IST

Indian men to finish 2020 in 4th position, women in 9th spot in FIH rankings
ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్​లో నాలుగో స్థానంలో భారత్​

ప్రపంచ ర్యాంకింగ్స్​-2020​లో భారత పురుషుల హాకీ జట్టు 4వ స్థానంలో నిలవగా.. మహిళల హాకీ జట్టు 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐఎఫ్​హెచ్​) సోమవారం ప్రకటన చేసింది.

ఈ ఏడాది హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్​లో భారత్ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. భారత పురుషుల జట్టు నాలుగో స్థానం, మహిళల హాకీ జట్టు తొమ్మిదో స్థానాన్ని దక్కించకుంది. కొవిడ్​ కారణంగా ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన అన్ని మ్యాచ్​లు రద్దయ్యాయి.

బెల్జియం పురుషుల హాకీ జట్టు, నెదర్లాండ్​ మహిళల హాకీ జట్టు.. ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో నిలిచినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐఎఫ్​హెచ్​) ప్రకటించింది.

పురుషుల హాకీ జట్ల ర్యాంకింగ్స్​..

1. బెల్జియమ్​ (2496.88)

2.ఆస్ట్రేలియా (2385.70)

3.నెదర్లాండ్స్​ (2252.96)

4.భారత్​ (2063.378)

5.అర్జెంటీనా (1967.39)

6.జర్మనీ (1944.34)

7.ఇంగ్లాండ్​ (1743.77)

8.న్యూజిలాండ్​ (1575.00)

మహిళల హాకీ జట్టు ర్యాంకింగ్స్​

1.నెదర్లాండ్​ (2331.99)

2.అర్జెంటీనా (2174.61)

3.జర్మనీ (2054.28)

4.ఆస్ట్రేలియా (2012.89)

5.ఇంగ్లాండ్​ (1952.74)

6.న్యూజిలాండ్​ (1818.98)

7.స్పెయిన్​ (1802.13)

8.ఐర్లాండ్​ (1583.09)

9.భారత్​ (1543.00)

10.చైనా (1521.00)

ఇదీ చూడండి: ధ్యాన్​చంద్​ బయోపిక్​ నిర్మాణానికి రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.